అగ్రనిర్మాత స్టడీ గురించి తెలిస్తే షాకింగే
అతను ఆన్‌లైన్‌లో తన ఫోటోల గురించి, తనపై రాసే రాతల గురించి ప్రతిదీ చదువుతానని.. తాను ఒక క్లోజ్డ్ బుడగలో నివసించనని ఒప్పుకున్నాడు.
చాలామంది ప్రముఖులు ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. కానీ ఇతడు మాత్రం మంచి చెడు అధ్వాన్నం వంటి పరిస్థితులపై అధ్యయనం చేస్తాడు. అందుకే అతడు బాలీవుడ్ లో అగ్ర నిర్మాత అయ్యాడు. ఇంతకీ ఎవరు ఆ నిర్మాత?
బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ గురించే ఈ లీడ్. అతడు తన 25 సంవత్సరాల కెరీర్ జర్నీ గురించి ఇటీవల మాట్లాడారు. తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ల గురించి చర్చించాడు. అతను ఆన్‌లైన్‌లో తన ఫోటోల గురించి, తనపై రాసే రాతల గురించి ప్రతిదీ చదువుతానని.. తాను ఒక క్లోజ్డ్ బుడగలో నివసించనని ఒప్పుకున్నాడు.
"నేను నా పేరు కోసం ఆన్ లైన్ లో వెతుకుతాను. మంచి చెడు ఏం రాస్తున్నారో చూస్తాను. నిజంగా చెడ్డ విషయాలు, నిజంగా చెడు విషయాలు చదివాను. ట్రోలింగ్‌లు ఆపై ప్రశంసనీయమైన కాలమ్‌లు, మంచి కథనాలు అన్నింటినీ చదివాను. ఒక చిత్రనిర్మాత ఒక బుడగ (బయటపడలేని ప్రపంచం)లో జీవించకుండా ఉండటం చాలా క్లిష్టమైనదని నేను భావిస్తున్నాను. మన చుట్టూ మంచిగా మాట్లాడేవారే ఉండొచ్చు కానీ బయట చాలా విషయాలు మాట్లాడతారని తెలుసుకున్నాను" అని కరణ్ అన్నారు.
నేను విమర్శలను చదివినప్పుడు ఒక కళాకారుడిని అయినా కానీ నేను కూడా మనిషిని అని అర్థం చేసుకున్నాను. నేను తడబడతాను, తప్పులు చేస్తాను. ప్రేక్షకులను ఆకట్టుకోని చెత్త సినిమాలు ఉంటాయి. అది నాకు తెలియాలి. విమర్శకులు మా జీవితాలను అనుసరించరు. వారు కేవలం అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు.. వారిని గౌరవించాలి. ఎవరికీ ఎజెండా లేదు. నా సినిమా వాళ్లకు నచ్చనప్పుడు "అయ్యో ఇదంతా కుట్ర.. ఈ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు" అని నేను చెప్పలేను. ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకుంటున్నారని మనం తెలుసుకోవాలి. ఊరూ పేరు లేని వారు రాసేవి కాదు కానీ, తెలివైన మంచి సమీక్షలు రాస్తే, వాటిని చదివి సినిమాలో తప్పిదాలు ఏం ఉన్నాయో చూడాలి. అలాగే వాటిని అంగీకరించాలి. ఎవరైనా ట్రోల్ చేస్తుంటే పొరపాటు జరిగి ఉండొచ్చు.. క్షమించండి అని చెప్పడంలో ఎటువంటి హాని లేదు.." అని నిజాయితీగా మాట్లాడారు. ప్రతికూలతలో ఒక నిర్దిష్ట విధానాన్ని పెంచుకున్నానని.. నేను తప్పులను అంగీకరిస్తున్నానని కరణ్ తెలిపారు. కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ తో అతడు చాలా బిజీగా ఉన్నాడు.