ఏడేళ్లు గ్యాప్ అయినా ట్విన్స్ కటింగ్ లేంటో?
కరీనా కాస్త నవ్వుతున్నట్లు కనిపిస్తున్నా..మలైకా కళ్లలో మాత్రం కాస్త సీరియస్ నెస్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
కరీనా కపూర్ ఖాన్-మలైకా అరోరా మధ్య ఏడేళ్ల గ్యాప్ ఉంది. కరీనా వయసు 43 కాగా..మలైకా ఏజ్ 50. మరి ఆ ఇద్దరు కలిసి ట్విన్స్ లా ఫోజులిస్తే? ఎలా ఉంటుందో తెలియాలంటే? ఈ పిక్ చూడాల్సిందే. కరీనా, మలైకా వైట్ అండ్ వైట్ లో ఇలా కవల పిల్లలా కటింగ్ లు ఇస్తిరి. వైట్ కలర్ ప్యాంట్ ..షర్ట్ లో ఇద్దరు పక్కపక్కనే నుంచుని కెమారాకి ఫోజులిచ్చారు. కరీనా ..మలైకా భుజం పై చేసి వేసి స్టైల్ గా నుంచుని ఉంది. ఇక మలైకా అయితే ఏకంగా తొడ కొడుతున్నట్లే కనిపిస్తుంది.
కరీనా కాస్త నవ్వుతున్నట్లు కనిపిస్తున్నా..మలైకా కళ్లలో మాత్రం కాస్త సీరియస్ నెస్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇద్దరం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ట్విన్స్ కాకపోయినా అంతకు మించి బాండింగ్ ఇద్దరి మధ్య ఉందన్నట్లు కరీనా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులంతా చూసి వీళ్లు ట్విన్స్ అని ఒక్క క్షణం కన్ ప్యూజ్ అవ్వడం ఖాయం. కరీనాకి అక్క ఎక్కడుంది? అంటూ ఓ అభిమాని పోస్ట్ చేసాడు.
మరొకరు వేగ్యంగాను కామెంట్ చేసారు. నా ఆఫీస్ లో స్టాప్ కూడా ఇలాగే ఉంటారు. ఇద్దర్నీ వైట్ అండ్ వైట్ లో చూసి మా వాళ్లు అనుకుని కంగారు పడ్డాను అని రాసుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఇద్దరి జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. కరీనా వరుసగా ఇప్పటికీ అదే దూకుడుతో సినిమాలు చేస్తోంది. 40 క్రాస్ అయినా వేగం ఏమాత్రం తగ్గలేదు. కొత్త అవకాశాలు..యువ హీరోలతో సైతం ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగుతుంది.
ప్రస్తుతం ఓ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఇక మలైకా అరోరా జర్నీ మాత్రం చప్పగానే సాగుతుంది. 50 దాటడంతో ఏ రకంగానూ అవకాశాలు రావడం లేదు. ఐటం భామగైనా మళ్లీ టాలీవుడ్ నుంచి పిలుపొస్తుందని భావిస్తుంది గానీ ఇక కష్టమే. బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. ఇన్ స్టాలో ఫిట్ నెస్ వీడియోలతో మెరవడం తప్ప మలైకా కొత్తగా చేసేదేం? లేనట్లే కనిపిస్తుంది.