ఆ స్టార్ తో కరీనా రొమాన్స్ ఇంత గ్యాప్ ఉందా!
రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తోన్న 'సింగం ఎగైన్' లో కరీనాకపూర్-అజయ్ దేవగణ్ కలిసి నటిస్తున్నారు.
అజయ్ దేవగణ్-కరీనాకపూర్ సక్సెస్ ఫుల్ జోడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ కాంబినేషన్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ అభిమానుల్లో ఉంది. అయితే కొంత కాలంగా ఈ జంట మళ్లీ చేతులు కలపలేదు. ఎవరికి వారు గాసినిమాలు చేసుకోవడం తప్ప కలిసి పనిచేయలేదు. ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లోనూ చాలా రకాల మార్పులు రావడంతోనూ ఇది సాధ్యపడలేదు. అయితే తాజాగా ఈ జంట తొమ్మిదేళ్ల తర్వాత చేతులు కలుపుతున్నారు.
రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తోన్న 'సింగం ఎగైన్' లో కరీనాకపూర్-అజయ్ దేవగణ్ కలిసి నటిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ లో కరీనా పేరు తెరపైకి వచ్చినప్పటికీ చాలా మంది నమ్మని పరిస్థితి. చాలా కాలంగా సినిమాలు చేయకపోవడంతో మళ్లీ ఈ జోడీ సాధ్యమేనా? అన్న విమర్శలు తెరపైకి వచ్చాయి.
అయితే అన్నింటికీ చెక్ పెడుతూ సింగం ఎగైన్ లో షురూ చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ లో కరీనా-అజయ్ ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట.
ఇద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. తొమ్మిదేళ్లు గ్యాప్ వచ్చినా! ఈ జోడీ రొమాన్స్ విషయంలో తగ్గలేదని మరోసారి నిరూపించ బోతున్నారు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు ఉన్నారు. కానీ సింగం ఎగైన్ లో సన్నివేశాలు డిమాండ్ చేయడంతో మరోసారి రొమాంటిక్ సన్నివేశాలకు ఎస్ చెప్పక తప్పలేదు. ఈ జోడీని తెరపై చూస్తే నే చాలు అని భావిస్తోన్న అభిమానులకు ఇది మంచి వార్తే.
అభిమాన తారలిద్దర్నీ మళ్లీ రొమాంటిక్ గా చూసే అవకాశం వస్తుందని ఖుషీ అవుతున్నారు. మరి జోడీ తెరపై ఎలా అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాలో దీపికా పదుకొణే..రణవీర్ సింగ్ లు కూడా నటిస్తున్నారు.రియల్ లైఫ్ లో భార్యభర్తలు అయిన ఈ జోడీ రీల్ పై నా అలా కనిపిస్తారా? లేక కేవలం గెస్ట్ పాత్రలతోనే సరిపెట్టి వెళ్లిపోతారా? అన్నది తెలియాలి. అక్షయ్ కుమార్ ..టైగర్ ష్రాప్ లు కూడా సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.