బాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరోయిన్ దిగేస్తుంది!
అయితే కన్నడ నటుడు యశ్ నటిస్తున్న 'టాక్సిక్' లోనే కరీనా కపూర్ నటిస్తుందని ఓ వార్త తెరపైకి వస్తుంది.
బాలీవుడ్ భామల ఎంట్రీ టాలీవుడ్ లో జోరందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే 'కల్కి 2898' తో లాంచ్ అవుతుంది. డార్లింగ్ ప్రభాస్ సరసన అలరించబోతుంది. ఇక అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ కూడా 'దేవర'తో ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇందులో అమ్మడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుంది. ఇలా ఇద్దరు పేరున్న భామలు టాలీవుడ్ లో లాంచ్ అవ్వడం విశేషం.
ఇప్పుడిదే వరసులో సౌత్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా రెడీ అయింది. నేను సైతం అంటూ విషయాన్ని అధికారింగా ప్రకటించింది. నేను త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ తో దక్షిణాదిన అడుగుపెడుతున్నాను. అది పాన్ ఇండియా ప్రాజెక్ట్. మొదటిసారి ఇలాంటి సినిమాలో నటిస్తున్నాను. దీని కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని నేను అర్దం చేసుకోగలను' అంటూ విషయం చెప్పేసింది.
దీంతో కరీనా అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. అమ్మడు సౌత్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా? అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అది ఇప్పటికీ సాధ్యమైంది. ఆమె ఎంట్రీ పై గతంలో అదిగో..ఇదిగో అంటూ ప్రచారం సాగింది గానీ ఇంతవరకూ జరగలేదు. ఎట్టకేలకు ఇక్కడి ప్రాజెక్ట్ కూడా షురూ చేసింది. అయితే ఆపాన్ ఇండియా ప్రాజెక్ట్ వివరాలు మాత్రం అమ్మడు రివీల్ చేయలేదు. ఆ విషయంలో అంతే గోప్యత వహిస్తుంది.
అయితే కన్నడ నటుడు యశ్ నటిస్తున్న 'టాక్సిక్' లోనే కరీనా కపూర్ నటిస్తుందని ఓ వార్త తెరపైకి వస్తుంది. అందుకు ఆస్కారం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే తెలుగులో పాన్ ఇండియా మర్కెట్ ఉన్న హీరోలంతా సెట్స్ లో ఉన్నారు. యశ్ మాత్రమే ఇంకా లైన్ లోకి రాలేదు. ఈ నేపథ్యంలో అతడి సినిమా కోసమే కరీనా ని ఎంపిక చేసి ఉండొచ్చని మెజార్టీ వర్గం భావిస్తోంది. కరీనా ఎంట్రీ కన్పమ్ అయితే అమ్మడు యశ్ నే డామినేట్ చేసేస్తుంది. ఎలాంటి పాత్రలైనా అవలీలగా పోషించగల నటి. హీరోయిన్ గా సుదీర్ఘ అనుభవం ఆమె సొంతం.