క‌పూర్ ఫ్యామిలీ హీరోయిన్ నిక‌ర ఆస్తులు 90 కోట్లు

బాలీవుడ్‌లో తనదైన మార్గాన్ని ఏర్పరచుకోవడానికి తన చదువును వదిలి, నటనలో తనకున్న అభిరుచిని ఎంచుకుంది

Update: 2024-06-28 02:45 GMT

క‌పూర్ సంస్థానంలో న‌ట‌న‌ను వృత్తిగా ఏర్ప‌రుచుకోవ‌డం అంటే ఒక సాహ‌సం. నాటి రోజుల్లో ఇత‌ర కుటుంబాల్లో ఉన్న‌ట్టే ఆడ‌పిల్ల‌ల‌కు క‌ట్టుబాట్లు చాలా ఎక్కువే ఉన్నాయి. రాజ్ క‌పూర్ వార‌సుల్లో మ‌హిళ‌లు ఎవ‌రూ సినీరంగంలో న‌టించ‌కూడ‌ద‌నే నియ‌మం ఉంది. కానీ కపూర్ కుటుంబం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి మహిళగా కరిష్మా కపూర్ ఒక సంచ‌ల‌నం. బాలీవుడ్‌కు బలమైన పునాదిని ఇచ్చిన పేరుగాంచిన కుటుంబం కపూర్ కుటుంబం. ఆడాళ్లు సినిమాల్లో న‌టించే విష‌యంలో దీర్ఘకాల సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. కానీ కరిష్మాకు త‌న‌ తల్లి బబిత నుంచి గట్టి మద్దతు ఉంది. బాలీవుడ్‌లో తనదైన మార్గాన్ని ఏర్పరచుకోవడానికి తన చదువును వదిలి, నటనలో తనకున్న అభిరుచిని ఎంచుకుంది.

ప్రస్తుతం కరిష్మా తన పిల్లలను ఒంటరి తల్లిగా పెంచడంపై దృష్టి పెట్టారు. భ‌ర్త సంజ‌య్ క‌పూర్ నుంచి విడాకులు తీసుకున్న సీనియ‌ర్ న‌టి క‌రిష్మా ఇటీవ‌ల టీవీ రంగంలో కొన‌సాగుతున్నారు. తన సినీ కెరీర్ ఎద‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం త‌న డెడికేష‌న్, హార్డ్ వ‌ర్క్. కుటుంబానికి, సినిమాకి తనను తాను అంకితం చేసిన మేటి న‌టి క‌రిష్మా. బాలీవుడ్ లో క‌రిష్మా పెద్ద స్టార్ అయ్యాక.., త‌న సోద‌రి క‌రీనా క‌పూర్ క‌థానాయిక‌గా త‌న హ‌వాను కొన‌సాగించింది.

Read more!

90ల నాటి మేటి ప్ర‌తిభావ‌ని కరిష్మా కపూర్ ఈరోజు (జూన్ 25న) తన పుట్టినరోజును జరుపుకుంది. కరిష్మా 2012లో తన చివరి చిత్రం `డేంజరస్ ఇష్క్` నుండి లైమ్‌లైట్ కి దూర‌మైంది. అయినా క‌రిష్మా ఆర్థికంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇటీవలి సినిమాలేవీ లేనప్పటికీ కరిష్మా ఆర్థిక స్థితి బలంగా ఉంది. ముంబై మీడియా కథనాల ప్రకారం క‌రిష్మా ఆస్తుల విలువ దాదాపు రూ. 85-90 కోట్లు. త‌న‌ ఆదాయాలు ముఖ్యంగా ప్రకటనలు, మోడలింగ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ లు సహా విభిన్న వనరుల నుండి వచ్చాయి. కరిష్మా బేబి ఓయ్ కంపెనీలో పెద్ద వాటాను కలిగి ఉంది. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. అలాగే టెలివిజన్ షోలకు న్యాయనిర్ణేతగా ప‌నిచేయడం ద్వారా వినోద పరిశ్రమకు సహకరిస్తుంది.

Tags:    

Similar News