గేమ్ చేంజర్.. అసలు బలం
పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి
కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక సొంతం చేసుకున్నారు. జిగార్తాండ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కార్తీక్ సుబ్బరాజు తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్, విక్రమ్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేశాడు. ప్రస్తుతం లారెన్స్, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో కాంబినేషన్ లో జిగార్తండ డబుల్ ఎక్స్ మూవీ రిలీజ్ అవుతోంది.
పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ లో జిగార్తాండ డబుల్ ఎక్స్ ప్రమోషన్ ప్రెస్ మీట్ లో కార్తిక్ సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పొలిటికల్ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండబోతోందనే సంగతి తెలిసిందే.
శంకర్ ఓ వైపు ఇండియన్ 2 చేస్తూనే మరో వైపు గేమ్ చేంజర్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. గేమ్ చేంజర్ కథని శంకర్ సార్ కలవకముందే తాను రాసాను. కచ్చితంగా పెద్ద హీరోతో మాత్రమే సాధ్యం అవుతుందని నా టీం కి చెప్పాను. అదే కథకు బలం. అయితే రాజకీయ నేపథ్యంలో సినిమాలు నేను చేయాలని అనుకోలేదు. శంకర్ సార్ కథ అడిగినపుడు ఆయన జోనర్ లో ఉంటుందని ఈ కథ చెప్పాను.
ఆయనకి కథ భాగా నచ్చింది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అతనే రాశారు. అలాగే ఈ మూవీ శంకర్ సార్ స్టైల్ లొనే చూడాలని నాకు ఉంది. చాలా ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చారు. కార్తీక్ సుబ్బరాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంకర్ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ని ఎలా చూపించబోతున్నారో చూడాలని మెగా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారని చెప్పాలి.