స్టార్ హీరోయిన్ బేబి బంప్‌ని దాస్తోంది!

ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానిస్తూ..''ఆమె 6 నెలల గర్భవ‌తి అనిపిస్తోంది'' అని వ్యాఖ్యానించ‌గా.. ''ఆమె ఖచ్చితంగా తన బేబీ బంప్‌ను దాచిపెడుతోంది..'' అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.

Update: 2024-06-25 10:19 GMT

క‌త్రిన కైఫ్‌- విక్కీ కౌశ‌ల్ జంట వివాహం అనంత‌రం బిజీ లైఫ్ గురించి తెలిసిందే. అయితే ఇటీవ‌ల క‌త్రిన ఎక్క‌డ కనిపించినా త‌న‌ను ఫ్రెగ్నెంట్ అంటూ అభిమానులు గుర్తిస్తున్నారు. కానీ దీనిని క‌త్రిన కానీ విక్కీ కానీ అధికారికంగా కన్ఫామ్ చేయ‌లేదు.

క‌త్రినా కైఫ్ జూన్ 24 అర్థరాత్రి ముంబై విమానాశ్రయంలో కనిపించింది. అయితే నెటిజ‌నుల‌ దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే.. క్యాట్ త‌న లోదుస్తులపై వదులుగా ఉన్న డెనిమ్ జాకెట్‌ను ధ‌రించింది. దీంతో క‌త్రిన‌ గర్భం దాల్చిందనే పుకార్లకు అద‌న‌పు బ‌లం చేకూరింది. కత్రిన కైఫ్ మొద‌టి బిడ్డ‌ను ఆశిస్తోంద‌నే వార్త‌లు కొన్ని వారాలుగా వైర‌ల్ గా మారాయి. అయితే ఈ పుకార్లపై ఎవ‌రూ స్పందించలేదు. క‌త్రిన లూజ్ కోట్ లో ఏదో దాస్తున్న‌ట్టు క‌నిపించ‌డంతో త‌ను బేబి బంప్ ని దాస్తోంద‌ని అభిమానులు గెస్ చేస్తున్నారు.

ఇవి గ‌ర్భ‌ధార‌ణ సంద‌ర్భంగా ధ‌రించిన ప్ర‌త్యేక దుస్తులు అంటూ నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు. గ‌త మేలో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంట‌ కొంత సమయం తీసుకుని లండన్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేసింది. ఈ జంట నగర వీధుల్లో షికార్లు చేస్తున్న‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కత్రినా విక్కీని ఎవరో రికార్డ్ చేయడం చూసి వారు దానిని వారించ‌డం క‌నిపించింది.

ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానిస్తూ..''ఆమె 6 నెలల గర్భవ‌తి అనిపిస్తోంది'' అని వ్యాఖ్యానించ‌గా.. ''ఆమె ఖచ్చితంగా తన బేబీ బంప్‌ను దాచిపెడుతోంది..'' అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. వేరొక‌రు ''ఆమె గర్భవతి అని 100 శాతం ఖచ్చితంగా తెలుస్తోంది'' అని వ్యాఖ్యానించారు. కత్రినా గర్భవతిగా ఉందా?? అని మ‌రొక‌రు ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల టైమ్స్ న‌వ్ ప్ర‌కారం.. కత్రినా కైఫ్ లండన్‌లో ప్రసవించే ఆలోచనలో ఉందని క‌థ‌నాలొచ్చాయి. ''అవును, ఆమె గర్భవతి. వారు తమ మొదటి బిడ్డను లండన్‌లో స్వాగతించనున్నారు. విక్కీ ఇప్పటికే ఆమెతో ఉన్నాడు''అని ఒక సోర్స్ పేర్కొంది. అయితే కత్రినా ఏజెన్సీ- రెయిన్‌డ్రాప్ ఇలాంటి ఊహాజనిత రిపోర్టింగ్‌ను వెంటనే నిలిపివేయాలని మీడియా సంస్థలను కోరింది.

Read more!

కత్రినా ఇటీవ‌ల‌ గత కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటోంది. చివరిసారిగా శ్రీరామ్ రాఘవన్ తెర‌కెక్కించిన 'మెర్రీ క్రిస్మస్'లో వెండితెరపై కనిపించింది. త‌దుప‌రి ట్రిప్తీ డిమ్రీ - అమీ విర్క్‌లతో కలిసి బాడ్ న్యూస్ లో కనిపించనుంది. రష్మిక మందన్నతో పాటు ఛవా, సంజయ్ లీలా భ‌న్సాలీ 'లవ్ అండ్ వార్'లోను క‌త్రిన న‌టిస్తోంది. ల‌వ్ అండ్ వార్ లో రణబీర్ కపూర్, అలియా భట్ కూడా నటించనున్నారు.

Tags:    

Similar News