బిచ్చగాడిగా కనిపించి షాక్‌ ఇచ్చిన హీరో..!

తాజాగా తమిళ్‌ హీరో కవిన్‌ లుక్ చూసి అంతా అవాక్కవుతున్నారు.

Update: 2024-10-11 23:30 GMT

ఒకప్పుడు హీరో అంటే చొక్కా నలగకుండా సినిమాలు చేసే వారు. ఏమాత్రం కష్టమైన యాక్షన్‌ సీన్స్ ఉన్నా డూప్‌తో మేనేజ్ చేసేవారు. డీ గ్లామర్‌ పాత్రలు ఏమైనా చేయాల్సి వస్తే నో చెప్పేవారు, లేదంటే డూప్‌తో నడిపించే వారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే డీ గ్లామర్‌ పాత్రలను చేసేందుకు ఓకే చెప్పే వారు. కానీ ఇప్పుడు హీరోలు కావాలని డిఫరెంట్‌ పాత్రల్లో నటిస్తూ, లుక్‌ తో షాక్ ఇస్తున్నారు. హీరోలు ఇలా కూడా ఉంటారా అంటూ అంతా అవాక్కు అయ్యే విధంగా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. తాజాగా తమిళ్‌ హీరో కవిన్‌ లుక్ చూసి అంతా అవాక్కవుతున్నారు.


టాలీవుడ్‌ హీరోల్లో ఇప్పటికీ కొందరు మాస్ లుక్‌లో కనిపించేందుకు టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటిది తమిళ హీరోలు బ్యాక్ టు బ్యాక్‌ బిచ్చగాళ్లు గా కనిపిస్తున్నారు. ఆమధ్య విజయ్ ఆంటోనీ బిచ్చగాడు పాత్రలో నటించి సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. రెండు సార్లు బిచ్చగాడు గా వచ్చిన విజయ్‌ ఆంటోనీ రెండు సార్లు విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు విజయ్ ఆంటోనీ దారిలోనే తమిళ యువ హీరో కవిన్‌ సైతం బిచ్చగాడు గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బ్లడీ బెగ్గర్‌ అనే సినిమాలో కవిన్ బిచ్చగాడు గా కనిపించబోతున్నాడు.

శివ బాలన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న బ్లడీ బెగ్గర్‌ సినిమాను ప్రముఖ దర్శకుడు నెల్సన్‌ దిలీప్ నిర్మిస్తున్నాడు. సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో బీస్ట్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తో జైలర్‌ సినిమాలను రూపొందించి దర్శకుడిగా టాప్‌లో ఉన్న నెల్సన్‌ 'బ్లడీ బెగ్గర్‌' సినిమాను నిర్మించడంతో తమిళనాట అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా శివ బాలన్‌ సినిమాను రూపొందిస్తున్నారు. తప్పకుండా బిచ్చగాడు సినిమా మాదిరిగా బ్లడీ బెగ్గర్ హిట్‌ అవుతుందని తమిళ ప్రేక్షకులు, మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారని తెలుస్తోంది.

కవిన్‌ హీరోగా నటించిన బ్లడీ బెగ్గర్‌ సినిమాను అక్టోబర్‌ 31న దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అదే రోజు యంగ్‌ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌ నటించిన అమరన్ సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కమల్‌ హాసన్‌ అమరన్‌ సినిమా నిర్మించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అమరన్ సినిమా ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌ బయోపిక్ అనే విషయం తెల్సిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అలాంటి క్రేజీ మూవీ కి పోటీగా బ్లడీ బెగ్గర్‌ సినిమాను పోటీగా విడుదల చేయబోతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News