రోటిప‌చ్చ‌డి..ప‌ప్పు..ర‌సం తో పుల్లుగా లాగించేస్తా! కీర్తి సురేష్

పుర్రికో బుద్ది..జిహ్వాకో రుచి అన్నారు. కొంత మందికి నాన్ వెజ్ చూస్తే నోరూరిపోతుందో..మరికొంత మందికి వెజ్ వంట‌కాలు చూస్తే లాలాజలం ఊరిపోతుంది.

Update: 2023-07-23 10:08 GMT

పుర్రికో బుద్ది..జిహ్వాకో రుచి అన్నారు. కొంత మందికి నాన్ వెజ్ చూస్తే నోరూరిపోతుందో..మరికొంత మందికి వెజ్ వంట‌కాలు చూస్తే లాలాజలం ఊరిపోతుంది. మ‌రి కీర్తి సురేష్ కి జిహ్వ‌కి ఏ రుచులంటే? ఇష్టం అంటే! అమ్మ‌డు మంచి వెజ్ ప్రియురాల‌ని తెలుస్తోంది. రోటిప‌చ్చ‌డి..ప‌ప్పు ర‌సం మెనులో ఉంటే ఆ పూట పుల్లుగా లాగించేంచేస్తుందిట‌. అవును ఈ విష‌యం అమ్మ‌డు స్వ‌యంగా తెలిపింది. వంట‌కాలు అన్నింటిలోకి ఆ మూడు అంటే ఇష్ట‌మ‌ట‌. అలా ఉల్లిదోశ‌..చ‌పాతీని రోల్ లా చేసి క‌త్తిరించి నూడిల్స్ లా తింటుందిట‌.

నాన్ వెజ్ వంట‌కాలు కాస్త దూరంగానే ఉంటుందిట‌. కూర‌గాయ‌ల‌కు ఇచ్చినంత ప్రాధాన్య‌త వాటికివ్వ‌ద‌ట‌. అలాగే క‌ప్పు కాపీ తాగుతుందిట‌. ఇక ఒత్తిడికి గురైన‌ప్పుడు డ్రైవింగ్ చేస్తుందిట‌. చిన్న నాటి స్నేహితురాలు ఆర్తితో కాసేపు మాట్లాడినా రిలాక్స్ అయిపోతుందిట‌. ఇక ఇంట్లో పూజ చేసే స‌మ‌యం ఉంటే పూజ‌లు భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో చేస్తుందిట‌. కానీ ఇంట్లో నిత్యం దీపం మాత్రం వెలుగుతుందిట‌.

`ఓం న‌మో నారాయ‌ణనాయ` అనే మంత్రం మంద్రంగా వినిపిస్తుందిట‌. ఆ మంత్రం విన్న‌ప్పుడ‌ల్లా చాలా పాజిటివ్ గా ఫీల‌వుతుందిట‌. ఇక జీవితంలో మ‌ర్చిపోలేని సంఘ‌ట‌న ఏదైనా ఉంది? అంటే అది ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత ఎదురైంది అంటోంది. తొలి రోజుల్లో ఐరెన్ లెగ్ అని పిలిచేవారుట‌. ఈ అమ్మాయిని సినిమాల్లో పెట్టుకుంటే సినిమా పోతుంద‌నే ముద్ర వేసారుట‌.

వాటిని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లాను కాబ‌ట్టే ఈ రోజు నిల‌బ్డాను అని తెలిపింది. అందుకే ఆ చీక‌టి రోజుల్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని అని చెప్పుకొచ్చింది. అలాగే న‌టి కాక‌పోయి ఉంటే ఫ్యాష‌న్ డిజైన‌ర్ అయి ఉండేద‌ట‌. న‌టి కాక ముందే చెన్నైలో ప్యాష‌న్ డిజైనింగ్ కోర్స్ చేసింద‌ట‌. రెండ‌వ ఆప్ష‌న్ గా రంగాన్ని ఎంచుకునే దాన్ని అంటోంది.

Tags:    

Similar News