సామ్‌కి థాంక్స్‌ చెప్పిన కీర్తి... ఎందుకో తెలుసా?

ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటనతో బేబీ జాన్‌ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో స్టార్‌ హీరోయిన్‌ సమంతకు కృతజ్ఞతలు తెలియజేసింది.

Update: 2024-12-31 14:30 GMT

'మహానటి' ఫేం కీర్తి సురేష్‌ తాజాగా బాలీవుడ్‌లో 'బేబీ జాన్‌' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. విజయ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా అట్లీ దర్శకత్వంలో వచ్చిన తేరి సినిమాకు రీమేక్‌గా బేబీ జాన్‌ సినిమా రూపొందింది. హిందీలో హీరోగా వరుణ్ ధావన్ హీరోగా నటించగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. కీర్తి సురేష్ పాత్రకు మంచి మార్కులు దక్కాయి. ముఖ్యంగా మొదటి సారి కీర్తి సురేష్ అందాల ఆరబోత చేయడంతో సౌత్‌లోనూ ఈ సినిమా గురించి చర్చ జరిగింది. కీర్తి సురేష్ పెళ్లి తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఆమె కెరీర్ గురించి అంతా ఆసక్తిగా చర్చించుకోవడం సోషల్‌ మీడియాలో కనిపించింది.

బేబీ జాన్ సినిమాకు పాజిటివ్‌ టాక్ వచ్చినా పుష్ప 2 సినిమా కారణంగా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి అనేది కొందరి మాట. ఆ విషయం పక్కన పెడితే బేబీ జాన్ సినిమా పోస్ట్‌ రిలీజ్ ప్రమోషన్స్‌లోనూ కీర్తి సురేష్ బిజీ బిజీగా ఉంది. పలు హిందీ షోల్లో పాల్గొనడంతో పాటు, పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటనతో బేబీ జాన్‌ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో స్టార్‌ హీరోయిన్‌ సమంతకు కృతజ్ఞతలు తెలియజేసింది. తనను హిందీ సినిమాకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు అంటూ సమంతపై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తేరి సినిమా రీమేక్‌ ప్రస్థావన వచ్చిన సమయంలో హీరోయిన్‌గా తన పేరును సమంత సూచించిందని, అందుకే తనకు ఛాన్స్ వచ్చిందని కీర్తి సురేష్‌ చెప్పింది. తాను తెరి సినిమాలో సమంత నటనకు అభిమానిని, అలాంటి పాత్రను నేను చేయగలనా అనే అనుమానం వచ్చింది. కానీ సినిమాలో నువ్వు మాత్రమే చేయగలవు అంటూ సామ్‌ నాలో నమ్మకం నింపింది. తప్పకుండా నువ్వు చేస్తావంటూ నాకు చెప్పడం వల్ల నేను ఈ సినిమాను పూర్తి చేశాను అంటూ చెప్పుకొచ్చింది. నాకు బాలీవుడ్‌లో ఈ మంచి అవకాశం దక్కడానికి కారణం అయిన సమంతకు కృతజ్ఞతలు, ఆమె మద్దతు వల్ల తాను బేబీ జాన్‌లో ఆకట్టుకోగలిగాను అంది.

కీర్తి సురేష్ టాలీవుడ్‌లో ఈమధ్య కొత్త సినిమాలకు కమిట్‌ కావడం లేదు. ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా పెద్ద సినిమాలు కాకపోవడంతో సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. తమిళ్‌ తో పాటు హిందీలో వరుసగా సినిమాలు చేయాలని కీర్తి సురేష్‌ భావిస్తుంది. అందుకే ఆమె మరోసారి హిందీలోనే నటించేందుకు ఆసక్తిని కనబర్చుతుందని తెలుస్తోంది. త్వరలోనే హిందీలో కీర్తి సురేష్ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు తమిళ్‌లో ఈమె నటిస్తున్న రెండు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News