కీర్తి సురేష్ పెళ్లి అసలెవరితో? ఏంటీ రూమర్లు?

అదే సమయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది అమ్మడు.

Update: 2024-07-27 07:17 GMT

హీరోహీరోయిన్ల పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. దీంతో వాటిపై స్పందించడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ అవే రూమర్లు ఎక్కువ అయితే ఒక్కోసారి స్పందిస్తుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అదే పని చేసింది. తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై రియాక్ట్ అయింది. అదే సమయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది అమ్మడు.

తన చిన్ననాటి ఫ్రెండ్ ను కీర్తి సురేష్ వివాహం చేసుకుంటుందని గత కొద్ది రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లేకుంటే ప్రముఖ కోలీవుడ్ కంపోజర్ తో ఏడడుగులు నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. దీంతో తన అప్ కమింగ్ మూవీ రఘ తాత ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి వార్తలపై స్పందించింది. అభిమానులతో ముచ్చటిస్తూ క్లారిటీ ఇచ్చింది. విమర్శల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతానని తెలిపింది.

తానెప్పుడూ రూమర్లపై స్పందించనని తెలిపింది కీర్తి సురేష్. ఏదైనా రూమర్ పై క్లారిటీ ఇస్తే చాలు.. అదే నిజమని అందరూ భావిస్తారని చెప్పింది. అయితే తన యాక్టింగ్ తోపాటు సినిమాపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తానని పేర్కొంది. వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతానని వెల్లడించింది. పర్సనల్ తోపాటు ఫ్యామిలీ విషయాల గురించి కామెంట్స్ చేస్తే వాటిని అసలు పట్టించుకోనని తెలిపింది కీర్తి సురేష్.

వాళ్లు చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ముఖ్యంగా తన పెళ్లి వార్తల్లో నిజం లేదని తెలిపింది. కీర్తి పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. గతంలో చాలాసార్లు అనేక వార్తలు వైరల్ అయ్యాయి. వాటన్నింటినిపై ఆమె తల్లిదండ్రులు ఓసారి రియాక్ట్ అయ్యారు. తమ కుమార్తె వివాహం గురించి వస్తున్న రూమర్స్ నిజం కావని ఖండించారు. ఇప్పుడు కీర్తి రియాక్ట్ అయింది.

ప్రస్తుతం కీర్తి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా అమ్మడు పెళ్లి రూమర్లు ఆగుతాయో లేదో చూడాలి. అసలు ఎవరితో కీర్తి పెళ్లి అని నెటిజన్లు అంటున్నారు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చిన కీర్తి సురేష్.. మహానటి మూవీతో ఓ రేంజ్ లో అలరించింది. నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది కీర్తి సురేష్.

Tags:    

Similar News