కీర్తి సురేష్ సినిమాలో రాజకీయాలు లేవ్!
కీర్తి సురేష్ స్పీడప్ అయిన సంగతి తెలిసిందే. కమర్శియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల జోరు పెంచింది.
కీర్తి సురేష్ స్పీడప్ అయిన సంగతి తెలిసిందే. కమర్శియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల జోరు పెంచింది. ఇటీవలే బాలీవుడ్ కి కూడా ప్రమోట్ అయింది. సినిమాలతో పాటు అక్కడ వెబ్ సిరీస్ లు చేస్తోంది. ప్రస్తుతం తమిళ్ లో `రఘుతాత` అనే సినిమా చేస్తోంది. ఇందులో అమ్మడు మెయిన్ లీడ్ పోషిస్తోంది. సుమన్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ విడుదలైన నాటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి.
సినిమాలో రాజకీయం ఉందంటూ ఓ అంశం తెరపైకి వస్తోంది. జాతీయ భాష హిందీ విషయంలో తమిళులు పూర్తిగా వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రలో భాషపై చాలా కాలంగా వ్యతిరేకత ఉంది. తమిళు లంతా హిందీ నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం..హిందీలో మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులంటూ నిబంధన విధించడంతో ఆ రాష్ట్రం భగ్గుమంది.
ఇదే అంశాన్ని `రఘుతాత` టీజర్ లో పాక్షికంగా కనిపిస్తుంది. అయితే ఈ వివాదంపై కీర్తి సురేష్ వివరణ ఇచ్చింది. హిందీకి వ్యతిరేకంగా సినిమా చేయడం ఏంటి అంటున్నారు. ఇది హిందీ వ్యతిరేక చిత్రం కాదు. కానీ హిందీని ఒకరిపై ఉద్దేశ పూర్వకంగా రుద్దడాన్ని, మహిళలపై నేటి సమాజంలో విధించిన ఆంక్షలను వ్యతిరేకించే చిత్రమిది. వివాదం కాకుండా నవ్వించే మెయిన్ స్ట్రీమ్ సినిమా అవుతుంది.
ఇదొక విభిన్నమైన కథ, కథనాలతో రూపొందింది. మహిళ ఎదుర్కునే సవాళ్లను చూపించాం. సినిమా చూస్తే మీకు విషయం అర్దమవుతుంది. ఇందులో రాజకీయ పరిమైన అంశాలంటూ ఏవీ ఉండవు. ఆద్యంతం నవ్వించే సినిమా. ఎవరి మనోభావాలు దెబ్బతీసే సినిమా కాదని బలంగా చెప్పగలను. అంతా కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమిది` అని అన్నారు.