2024లో మాలీవుడ్ రూ.700 కోట్లు నష్టపోయిందా?

తాజాగా కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. 2024లో తమకు రూ.700 కోట్ల నష్టం వచ్చినట్లు చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

Update: 2024-12-30 01:30 GMT

2024లో అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరికొన్ని ఊహించని విధంగా విజయాలు సాధించాయి. ఇంకొన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్లుగా మారాయి. మిగతా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మోస్తరు హిట్స్ గా నిలిచాయి.

అయితే మరో 3 రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి.. 2025కు వెల్ కమ్ చెప్పనున్న విషయం తెలిసిందే. దీంతో ఏడాదికి సంబంధించిన రిపోర్ట్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తాజాగా కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. 2024లో తమకు రూ.700 కోట్ల నష్టం వచ్చినట్లు చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

దీంతో నెటిజన్లు అంతా అవాక్కవుతున్నారు. అయితే ఏడాది మొత్తం కలిపి మాలీవుడ్ నుంచి 199 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయని కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ వెల్లడించింది. వాటి కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. 199లో కేవలం 26 సినిమాలే బాక్సాఫీస్ వద్ద హిట్స్ గా నిలిచాయని చెప్పింది.

అందుకే తాము చేసిన వ్యయంలో రూ.300 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయని తెలిపింది. దీంతో రూ.700 కోట్ల నష్టం ఏర్పడిందని చెప్పింది. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు నటీనటుల రెమ్యూనరేషన్లు భారీగా పెరిగాయని, అందుకే తమకు రావాల్సిన ప్రాఫిట్స్ కూడా భారీగా తగ్గిపోయాయని కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ పేర్కొంది.

అయితే 2024లో మాలీవుడ్ లో తెరకెక్కిన మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం, ఎ.ఆర్.ఎం, ఆవేశం, ప్రేమలు, భ్రమ యుగం, సూక్ష్మ దర్శిని వంటి పలు సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అందులో కొన్ని సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుని సత్తా చాటాయి.

అదే సమయంలో ముంజుమ్మల్ బాయ్స్ మూవీ రూ.240 కోట్ల గ్రాస్ ను రాబట్టి 2024లో మాలీవుడ్ లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆడు జీవితం, ఎ.ఆర్.ఎం, ప్రేమలు మూవీలు రూ.100 కోట్లకు పైగా రాబట్టాయి. అలాంటిది ఇప్పుడు కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్‌ రూ.700 కోట్ల నష్టం వచ్చిందని ప్రకటించడంతో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News