ఆ హీరోయిన్ ని బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది!
సినిమాలో తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఫోకస్ అవ్వలేదు. సినిమా ఫలితం బాగానే ఉన్నా! కేతిక పేరు పెద్దగా వైరల్ అవ్వడం లేదు.
హీరోల కు ఉన్నంత లైప్ స్పాన్ హీరోయిన్లకు ఉండదు. ఫేం లో ఉన్నంత కాలం కొనసాగుతారు. ఆ తర్వాత ఇంటికెళ్లిపోతారు. అవకాశాలు రావడం గొప్ప కాదు. వాటిని నిలబెట్టుకుని ముందుకెళ్లడం గొప్ప. ఈ విషయంలో ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ వైఫల్యం లో కనిపిస్తోంది. రొమాంటిక్ సినిమాతో మెరుపు వేగంతో దూసుకొచ్చిన బ్యూటీ కి తొలి సినిమా ఫలితం బెడిసి కొట్టింది. అయినా సరే అమ్మడిలో కొన్ని రేర్ క్వాలిటీస్ కెరీర్ లో ముందుకు తీసుకెళ్లాయి.
ఆ వెంటనే ' లక్ష్య'..'రంగరంగ వైభవంగా' లాంటి సినిమాల్లో ఛాన్సులందుకుంది. 'రంగరంగ బాగానే ఆడినా కేతిక పెద్దగా ఫోకస్ కాలేదు. ఇక లక్ష దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. ఇలా ఇన్ని వైఫల్యాలున్నా! కేతికకి 'బ్రో' సినిమాలో అవకాశం వెతుక్కుంటూ మరీ వచ్చింది. పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించిన సినిమాలో అవకాశం అంటే మాటలా? నిజంగా పెట్టి పుట్టాలి. ఆయన తో సీన్లు లేకపోయినా సినిమాలో భాగమైతేనే బోలెడంత క్రేజ్ వచ్చేస్తుంది.
కానీ ఈ సినిమా విషయంలో అదేం జరగలేదు. సినిమాలో తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఫోకస్ అవ్వలేదు. సినిమా ఫలితం బాగానే ఉన్నా! కేతిక పేరు పెద్దగా వైరల్ అవ్వడం లేదు. మరి మూడు ప్లాప్ లు చూసి..ఒక హిట్ అందుకున్న భామ కెరీర్ ని ఎలా డిసైడ్ చేయాలంటే? కేతిక ని డ్యాడ్ టైమ్ బంతాడేస్తున్నట్లే కనిపిస్తోంది. హిట్ వచ్చినా గుర్తింపు రాలేదంటే! అంతకు మించిన అన్ లక్ హీరోయిన్ ఎవరుంటారు.
చిన్న సినిమా హిట్ అయితేనే నవ నాయికలు బోలెడంత హంగామా చేసేస్తున్నారు. కానీ కేతిక విషయంలో అలా జరగడం లేదు. మరి అమ్మడు తనని తాను అలా ఫోకస్ చేసుకోవడంలో విఫలమవుతుందా? లేక తెలిసి తెలియని తప్పిదాల కారణంగా అలా జరుగుతందా? అన్నది దృష్టి పెట్టాలి. ప్రస్తుతం కేతిక శర్మ హ్యాండ్స్ లో ప్రాజెక్ట్ లేవి కనిపించడం లేదు. మరి బ్రో విజయం అయినా కొత్త అవకాశాల కు బలమైన పునాది వేస్తుందా? అన్నది చూడాలి.