బజార్ ఇండియా పై ఖుషీ స్టన్నింగ్ సర్ ప్రైజ్!
రెగ్యులర్ డిజైన్స్ భిన్నంగా ఉన్న ఓ సరికొత్త డిజైన్ లో కవర్ పేజీపై మెరిసిందిలా. గ్రేకలర్ డిజైనర్ దుస్తుల్లో ఖుషీ ఒదిగిపోయింది.
అతిలోక సుందరి శ్రీదేవి రెండవ కుమార్తె ఖుషీ కపూర్ నెట్టింట ఎప్పుడు కనిపించినా ఓ సంచలనమే. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న నేపథ్యంలో అమ్మడు మరింత యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇండస్ట్రీకి మరింత గా టచ్ లో ఉంటూ కెరీర్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉంది. ఇక ఫోటో సెషన్లు... హాట్ ఫోటోలు..ఆల్ట్రా మోడ్రన్ డిజైన్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వాటిలో అమ్మడు ఎప్పుడో పీహెచ్ డీలు చేసేసింది. కొత్త కొత్త ఫోటోలతో చూపరులను ఆకర్షించడం పరిపాటే.
తాజాగా బజార్ ఇండియాపై అమ్మడు తళుక్కున మెరిసింది. ఆల్ట్రా మోడ్రన్ డిజైన్ దుస్తుల్లో సర్ ప్రైజ్ చేసింది. రెగ్యులర్ డిజైన్స్ భిన్నంగా ఉన్న ఓ సరికొత్త డిజైన్ లో కవర్ పేజీపై మెరిసిందిలా. గ్రేకలర్ డిజైనర్ దుస్తుల్లో ఖుషీ ఒదిగిపోయింది. అందమైన డిజైన్ లో మరింత అందంగా కనిపించింది. అమ్మడి అలంకరణ ప్రతీది ఖుషీకి మరింత బ్యూటీని తీసుకొచ్చాయి. కాళ్లకు బ్లాక్ షూస్ ధరించింది. అమ్మడు ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతీది ప్రఖ్యాత లూయిస్ విట్టన్ బ్రాండ్ కి చెందింది.
2024-25 కలెక్షన్స్. లూయిసెట్ చెవిపోగులు - LV జానెట్ యాంకిల్ బూట్లు సహా అన్నీ. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ డిజైన్ లో ఖుషీ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఖుషీ బాడీ షేప్ ని మరింత బ్యూటీని జోడించింది. ఖుషీ ని చూసి అభిమానులు స్టన్ అవుతారు? అంత అందంగా హైలైట్ అయ్యేది ఖుషీనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్ లో అక్క జాన్వీకి పోటీగా మారుతుందా? అంటున్నారు. ఓ నెటి జనుడు అమ్మడి డిజైన్ చూసి పెంగ్విన్ పక్షితో పోల్చాడు.
`ది అర్చీస్` మ్యాకప్ వేసుకున్న ఖుషీ కపూర్ అసలైన వార్ లోకి ఇప్పుడే ఎంటర్ అయింది. ఇప్పటికే రెండు సినిమా లకు సైన్ చేసింది. అవి సెట్స్ లో ఉన్నాయి. జాన్వీ కపూర్ ని పరిచయం చేసిన నిర్మాత కరణ్ జోహార్ నే ఖుషీని కూడా బాలీవుడ్ లో లాంచ్ చేస్తున్నారు.