వీడియో: కొల్లేరు కొంగ నడిచొచ్చిన చందం
నగరంలో 'ది ఆర్చీస్' గ్యాంగ్ హల్చల్ గురించి తెలిసిందే. డెబ్యూ నటీమణుల హంగామా పీక్స్ కి చేరుకుంది
నగరంలో 'ది ఆర్చీస్' గ్యాంగ్ హల్చల్ గురించి తెలిసిందే. డెబ్యూ నటీమణుల హంగామా పీక్స్ కి చేరుకుంది. యువకెరటాలు తమదైన ఆకర్షణ, ప్రతిభ, సహృదయతతో హృదయాలను దోచుకుంటున్నారు. పబ్లిక్ పర్సోనాల్లో గ్లామ్ అండ్ గ్లిట్జ్ కు అతీతంగా వర్ధమాన తారలు ఇటీవల తమను తాము ఆవిష్కరించుకుంటున్నారు.
ది ఆర్చీస్ టీమ్ లో సుహానా, ఖుషీ కపూర్ ఇతరుల కంటే ఎక్కువగా లైమ్ లైట్ ని దొంగిలిస్తున్నారు. ఇంతకుముందే సుహానా ఖాన్ లేటెస్ట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ అయింది. ఇంతలోనే ఇప్పుడు ఖుషీ కపూర్ యూనిక్ ఫోటోషూట్ వెబ్ ని వేడెక్కించింది.
ఈ ఫోటోషూట్ కోసం ఎంపిక చేసుకున్న డిజైనర్ ఫ్రాక్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఈ లాంగ్ థై స్లిట్ ఫ్రాక్ లో ఖుషీ కొల్లేటి కొంగను తలపించిందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తగ్గట్టే ఖుషీ ఎత్తుమడమలు ధరించి పొడుగు కాళ్ల సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తూ కొంగనే తలపించింది. జాన్వీ కంటే ఖుషీ కపూర్ ఎత్తు (హైట్) ఎక్కువ. దానికి తగ్గట్టే తన డ్రెస్ డిజైన్ కూడా ఎంతో యాప్ట్ అయింది. టాప్ టు బాటమ్ బ్లాక్ లో ఖుషీ ధగధగా మెరిసిపోతోంది. ప్రమోషనల్ ఈవెంట్‌లో ఖుషీ కపూర్ బ్లాక్ డ్రెస్ గురించి అహూతుల్లో చర్చ సాగింది. ముఖ్యంగా బాటమ్ లైన్ లో ఫెదర్ తో డిజైన్ చేసిన స్పాట్ లుక్ కోసం డిజైనర్లు చాలా శ్రమించారని కూడా అర్థమవుతోంది.
ది ఆర్చీస్ గ్యాంగ్ రహస్యాలు:
'ది ఆర్చీస్' స్టార్లు తాజా ప్రచార వేదికపై బయటి ప్రపంచానికి అంతగా తెలియని రహస్యాలను షేర్ చేసారు. అభిమానులకు వారి ప్రత్యేకమైన సంగతులు చెబుతూనే, వారిలో దాగి ఉన్న ప్రతిభను కూడా వేదికలపై ప్రదర్శిస్తున్నారు. తాను 'కనుసైగ చేసే కళ'తో పోరాడుతున్నట్లు సుహానా తెలిపింది. ఖుషీ కపూర్ సమయపాలన పట్ల తన నిబద్ధతను వెల్లడించింది. సమయం తరచుగా చేజారిపోతున్నట్లు కనిపించే ప్రపంచంలో ఖుషీ సమయానికి చేరుకోవడం గురించి గర్వపడతానని తెలిపింది. ది ఆర్చీస్ గ్యాంగ్ సభ్యుడు వేదాంగ్ రైనా గేమింగ్‌పై తన అభిరుచిని బయటపెట్టాడు. ది ఆర్చీస్ సభ్యుడు మిహిర్ అహుజా, ఫార్ములా 1 కారు శబ్దాలను అనుకరించే సామర్థ్యం - ఊహించని ప్రతిభను వెలికి తీసుకొచ్చారు. ది ఆర్చీస్‌లోని మరొక సభ్యుడు డాట్ ఒక ఆశ్చర్యకరమైన అభిరుచిని వెల్లడించారు. అదే క్రోచింగ్. అగస్త్య నంద తన వేళ్ల ద్వారా శబ్దాలను సృష్టించగల సామర్థ్యం గురించి తెలిపాడు. మేకప్‌పై తనకు చాలా ఆసక్తి ఉందని యువరాజ్ మెండా అన్నారు.