అంబానీ పెళ్లి కోసం కిమ్ పాట్లు చూడతరమా
పెళ్లిలో అమెరికన్ టీవీ రియాలిటీ నటి కిమ్ కర్ధాషియన్, ఆమె సోదరి ఖోలే కర్ధాషియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వివాహం వరల్డ్ బెస్ట్ ఈవెంట్లలో ఒకటి. దాదాపు 5000 కోట్ల బడ్జెట్‌తో అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని నిర్వహించిన ఘనత అంబానీలకే చెందుతుంది. ఈ వేడుకల కోసం ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు క్యూ కట్టారు. పెళ్లిలో అమెరికన్ టీవీ రియాలిటీ నటి కిమ్ కర్ధాషియన్, ఆమె సోదరి ఖోలే కర్ధాషియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ముఖ్యంగా కిమ్ కర్ధాషియన్ ఫ్యాషన్ సెన్స్, స్ట్రైకింగ్ లుక్స్ గురించి బోలెడంత చర్చ సాగింది. కిమ్ కి సంబంధించిన ఫోటోసెషన్ లు, వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా షేర్ అయ్యాయి. ఇవన్నీ యువతరంలో గుబులు పెంచాయి. అయితే ఈవెంట్ అనంతరం తన స్వస్థలానికి వెళ్లాక కూడా కిమ్ కర్ధాషియన్ అంబానీల పెళ్లి వేడుకలను మర్చిపోలేకపోతోంది. అపరిమితమైన మర్చిపోలేని అనుభూతులను ఇప్పటికీ ఫోటోలు వీడియోల రూపంలో ఇన్ స్టా మాధ్యమంలో షేర్ చేస్తోంది.
తాజాగా కిమ్ కర్దాషియాన్ షేర్ చేసిన త్రోబ్యాక్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇవి తెరవెనుక గ్లింప్స్ ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నాయి. కిమ్ వ్యక్తిగత టచ్‌ను ఎలివేట్ చేస్తున్న దుస్తుల డిజైన్ కోసం ఎలాంటి శ్రమ దాగి ఉందో వీటిని చూస్తే అర్థమవుతోంది. వీటిలో భారీ డైమండ్ నెక్లెస్‌తో అలంకరించిన వెండి చీరలో.. పచ్చ ఆకుపచ్చ ఉపకరణాలతో చాలా ప్రత్యేకంగా కనిపించింది. చిక్ సిల్వర్ గ్రే థై-హై స్లిట్ గౌనును, ఎరుపు రంగు లెహంగాను కూడా కిమ్ ప్రదర్శించింది. `ఫైల్స్ మిస్సింగ్ ఇన్ ఇండియా` అని క్యాప్షన్ తో కిమ్ వీటిని షేర్ చేస్తోంది. ఈ ఫోటోలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అందాల కథానాయిక మృణాల్ ఠాకూర్ కిమ్ ఫోటోలకు ఫైర్ ఎమోజీతో రెస్పాండ్ అయ్యారు. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా హార్ట్ ఎమోజీలను షేర్ చేసి కిమ్ ఆకర్షణీయమైన రూపంపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. కర్దాషియాన్ సోదరీమణుల ముంబై సందర్శన ఫ్యాషన్ వేదికలకు మించినది. అభిమానులకు అది గొప్ప ట్రీట్ గా మారింది. ఈవెంట్లో కిమ్ - ఖోలే సిస్టర్స్ సాంప్రదాయ భారతీయ వస్త్రధారణతో కనిపించి ఆశ్చర్యపరిచారు. వారి ఆసక్తి అందరినీ ఆకట్టుకుంది.
కిమ్ , ఖోలే కర్దాషియాన్‌లతో పాటు అంబానీ వివాహానికి జాన్ సెనా, మైక్ టైసన్, UK మాజీ ప్రధానులు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్, చెరీ బ్లెయిర్, సెలబ్రిటీ స్టైలిస్ట్ లా రోచ్ వంటి ప్రముఖ అతిథులు కూడా హాజరయ్యారు.