వినాయకుడి ముందు కిమ్ వేషాలు మంటెత్తిన జనం!
అంబానీ ఇంట వివాహ వేడుక కోసం హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ కూడా ముంబై వచ్చిన సంగతి తెలిసిందే.
అంబానీ ఇంట వివాహ వేడుక కోసం హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ కూడా ముంబై వచ్చిన సంగతి తెలిసిందే. అంబానీ అతిధ్యం స్వీకరించి ఎంచక్కా ముంబై అందాల్ని అదే పనిగా ఆస్వాదించింది. చేతిలో ఉన్న కొద్ది సమయాన్నే వినియోగించుకుంది. ఈ క్రమంలోనే అమ్మడు వినాయకుడు ముందే వేషాలు వేసి అడ్డంగా బుక్కైంది. వినాయకుడి విగ్రహంపై చేయి వేసి ఫోటోషూట్ చేసింది కిమ్.
అమ్మడు పద్దతైన దుస్తుల్లోనే కనిపించింది. ఆ ఫోటో కోసం అమ్మడు ఎంతో అందంగా ముస్తాబైంది. కానీ వినాయకుడి మీద చేతులు పెట్టి దాని మీద తలకాయ పెట్టి ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో హిందు వర్గమంతా మంటెక్కిపోయింది. అమమ్మడిపై భక్తులంతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా కిమ్ వ్యవరించిందని మండిపడ్డారు.
ఇండియాకి ఇందుకే వచ్చావా? అంటూ నెటి జునలు అగ్రహంతో ఊగిపోయారు. దీంతో వాళ్ల దాడిని తట్టుకోలేకే కిమ్ ఆ ఫోటోల్ని డిలీట్ చేసింది. దీంతో హిందువులంతా శాంతించారు. ఇలాంటి ఫోటోల్ని పెట్టే వాళ్లకి గుడిలోకి వెళ్లే ప్రవేశ అవకాశం కూడా ఇవ్వకూడదంటూ మండిపడ్డారు. అయితే కిమ్ తెలియకనే ఆ తప్పు చేసిందని..నిజంగా హిందువుల మనోభావాలు ఇంతగా దెబ్బ తింటాయి? అంటే ఆ ఫోటోలు పోస్ట్ చేసేది కాదని ఆమె మద్దతి వర్గం తెలిపింది.
అయితే విదేశీయులు ఇలా వ్యవరించడం కొత్తేం కాదు. హిందువులు పూజించే దేవుళ్ల ఫోటోలు, విగ్రహాలు కొంతమంది బయటి వ్యక్తులకు కేవలం అలంకార వస్తువులుగా భావించిన సందర్భాలున్నాయి. ఇలా వ్యవరించిన సెలబ్రిటీలపై నెటి జనులు ధీటుగా స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.