అంబానీ పెళ్లిలో కంటే వోగ్ లుక్కులే బెటర్!
కిమ్ వెస్ట్రన్ లుక్ కి భిన్నంగా భారతీయత నిండిన దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తోందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
అంబానీ పెళ్లిలో తరుణ్ తహలానియా లెహంగా.. మనీష్ మల్హోత్రా శారీలో తళుకుబెళుకులు ప్రదర్శించిన కిమ్ కర్ధాషియన్.. ఇప్పుడు వోగ్ కవర్ త్రోబ్యాక్ ఫోటోషూట్ లో తళుకుబెళుకులు గుండెల్ని కొల్లగొడుతున్నాయి. 2018లో వోగ్ కవర్ పేజీపై అమెరియన్ రియాలిటీ క్వీన్ హొయలు మతులు చెడగొట్టాయి.
పర్పుల్ కలర్ షిమ్మరీ చీర- రవికెలో .. ట్రెడిషనల్ లెహంగాలో.. డిజైనర్ థై స్లిట్ గౌనులో రకరకాలుగా ఫోజులిచ్చిన కిమ్ పూర్తిగా భారతీయ సాంప్రదాయ హంగులతో మైమరిపించింది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. కిమ్ వెస్ట్రన్ లుక్ కి భిన్నంగా భారతీయత నిండిన దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తోందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
మార్చి 2018లో కిమ్ కర్దాషియాన్ వోగ్ ఇండియా కవర్‌పై కనిపించారు. చీరలు, నగలు, బట్టలు-అన్నీ చాలా అందంగా ఉన్నాయి! తన షోకి భారత్‌కు ఎలా చేరుకోవాలో మనం గుర్తించాలి…చెప్పాలి. ఇప్పుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహం కోసం భారత్ కి వచ్చింది. మేము ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపురంగు సభ్యసాచి గౌన్ సహా మా షూట్ నుండి ఆమె వైరల్ లుక్‌లను తిరిగి చూస్తున్నాము. అనితా డోంగ్రే రూపొందించిన చీరలో..అనామికా ఖన్నా రూపకల్పనలోని రెండు లెహంగాల్లో కిమ్ అందంగా కనిపించింది. కిమ్ ఈసారి ఏ సమిష్టిని ఎంచుకుంటారని మీరు అనుకుంటున్నారు? అంటూ వోగ్ త్రోబ్యాక్ ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
అయితే అంబానీ పెళ్లిలో కిమ్ కర్ధాషియన్ రకరకాల డిజైనర్ లుక్స్ లో కనిపించగా వాటికి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. పెళ్లిలో కిమ్ లుక్ కంటే 2018 వోగ్ ఇండియా కవర్ పై లుక్స్ చాలా బావున్నాయి! అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. వోగ్ ప్రస్తుతం ఈ త్రోబ్యాక్ ఫోటోలతో కిమ్ టూర్ గురించి ప్రస్థావిస్తూ కావాల్సిన ప్రచారం కొట్టేస్తోంది.