ఈ భామ ర‌వీనా టాండ‌న్‌కి కోడ‌లు అని తెలుసా?

కిర‌ణ్‌ రాథోడ్ రాజస్థాన్‌లోని గౌరవనీయమైన రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన న‌టి.

Update: 2024-10-20 03:15 GMT

బోల్డ్ బ్యూటీ కిరణ్ రాథోడ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ‌ హిందీలో కెరీర్ ప్రారంభించి తెలుగు, త‌మిళంలో పాపుల‌రైంది. మలయాళం, కనడ చిత్రాలలోను న‌టించింది. కిరణ్ రాథోడ్ 1981 జనవరి 11న జైపూర్‌లో జన్మించారు. మోహన్ సింగ్ రాథోడ్ & అనితా రాథోడ్ ల‌ కుమార్తె. ఆమె బాలీవుడ్ విలన్ అమ్జద్ ఖాన్, రవీనా టాండన్‌ల కోడలు. కిర‌ణ్‌ రాథోడ్ రాజస్థాన్‌లోని గౌరవనీయమైన రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన న‌టి. ముంబైలోని మిథిబాయి కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. యుక్తవయస్సులో ప‌లు హిందీ పాప్ ఆల్బ‌మ్స్ లో న‌టించింది.


2001లో హిందీ చిత్రం 'యాదేన్‌'లో మోనిష్క రాయ్‌గా తెరంగేట్రం చేసింది. అయితే ఆ చిత్రం పెద్ద ఫ్లాప్ అవ్వ‌డంతో దాని ప్ర‌భావం కెరీర్ పై ప‌డింది. 2002లో విక్రమ్ (నటుడు) సరసన తమిళ చిత్రం జెమినీతో విజ‌యం అందుకుంది. తెలుగులో నువ్వు లేక నేను లేను చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. తర్వాత అజిత్ కుమార్ - మీనాతో పాటు విలన్ కూడా వచ్చింది. అది కూడా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. అదే సంవత్సరంలో హిందీ చిత్రం జానీ దుష్మన్: ఏక్ అనోఖి కహానీలో కనిపించింది. ఆ సంవత్సరం మలయాళంలో తాండవం చిత్రంతో ఆరంగేట్రం చేసింది. తర్వాత దివాన్, అరసు, విన్నర్, తెన్నవన్, న్యూ వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాల్లో నటించింది. 2004లో కిర‌ణ్‌ రాథోడ్ నాని , అందరు దొంగలే దొరికితే అనే రెండు తెలుగు సినిమాల్లో కనిపించింది. ద‌క్షిణాది ఉత్త‌రాది సినిమాల‌తో బిజీ అయింది. ఆమె 2009లో నాలై నమధే చిత్రంలో సరసు అనే వేశ్య పాత్రను పోషించింది, అయితే ఆ చిత్రం పెద్దగా గుర్తింపు ద‌క్కించుకోలేదు. జగ్గుభాయ్, కెవ్వు కేక, సాగుని లో న‌టించింది. అంబాలాలో విశాల్ కృష్ణ‌ కి అత్త పాత్రను పోషించింది. కిర‌ణ్ న‌టించిన ప‌లు అనువాద చిత్రాలు తెలుగులోకి డ‌బ్ అయ్యాయి. కెరీర్ మ‌లుపులో ఈ భామ బోల్డ్ గా అందాలు ఆర‌బోసేందుకు, ఐట‌మ్ నంబ‌ర్లు, డీగ్రేడ్ సినిమాల్లో న‌టించేందుకు వెన‌కాడ‌లేదు. కానీ ఇవేవీ ఎక్కువ కాలం కెరీర్ జ‌ర్నీ కి స‌హ‌క‌రించ‌లేదు.


ఇటీవ‌ల ఈ భామ కెరీర్ దాదాపు ముగిసింది. దీంతో సోష‌ల్ మీడియాల్లో ర‌క‌ర‌కాల వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. కిర‌ణ్ రాధోడ్ కెరీర్ చివ‌రిలో కొన్ని డీగ్రేడ్ చిత్రాల్లో న‌టించింది గనుక ఇప్పుడు ఇన్ స్టా ప్రొఫైల్ లోను అలాంటి వీడియోలు, ఫోటోషూట్లు ద‌ర్శ‌నమిస్తున్నాయి. తాజాగా కిర‌ణ్ రాథోడ్ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. ఈ ఫోటోలో కిర‌ణ్ ఏమాత్రం రాజీ అన్న‌దే లేకుండా పొట్టి మిడ్డీలో త‌న థై అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది.

Tags:    

Similar News