అది చేయగలిగితే ఆ నిర్మాత గ్రేట్‌..!

చిన్న బడ్జెట్‌ సినిమా అయినా, వందల కోట్ల బడ్జెట్‌ సినిమా అయినా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సమయంలో వేసుకున్న బడ్జెట్‌ ను కచ్చితంగా దాటుతుంది

Update: 2024-03-05 04:57 GMT

చిన్న బడ్జెట్‌ సినిమా అయినా, వందల కోట్ల బడ్జెట్‌ సినిమా అయినా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సమయంలో వేసుకున్న బడ్జెట్‌ ను కచ్చితంగా దాటుతుంది. కథ అనుకున్న సమయంలో ఒక బడ్జెట్‌, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి అయిన తర్వాత ఒక బడ్జెట్‌, సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత మరో బడ్జెట్‌, విడుదలకు సిద్ధం అయిన సమయంలో మరో బడ్జెట్‌.. ఇలా బడ్జెట్‌ లెక్కలు మారుతూనే ఉంటాయి.

ప్రతి సినిమాకు కూడా ఎంతో కొంత బడ్జెట్‌ పెరుగుతూనే ఉంటుంది. అది 10 నుంచి 100 శాతం వరకు కూడా అయ్యి ఉంటుంది. కొన్ని సినిమాలకు మొదట అనుకున్న బడ్జెట్‌ కంటే మూడు నాలుగు రెట్లు పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బడ్జెట్‌ పెరగకుండా సినిమా నిర్మించడం అనేది ఈ రోజుల్లో అసాధ్యం అని భీమా నిర్మాత కెకె రాధా మోహన్ పేర్కొన్నారు.

ఆయన నిర్మించిన భీమా సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్‌ హీరోగా రూపొందిన భీమా సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత కెకె రాధా మోహన్‌ బడ్జెట్ గురించి మాట్లాడుతూ అన్ని సినిమాల మాదిరిగానే మా సినిమా బడ్జెట్‌ కూడా మొదట అనుకున్న దాని కంటే ఎక్కువ అయ్యింది అన్నాడు.

ఎంత ప్రణాళిక బద్దంగా సినిమాను నిర్మించినా కూడా ఏదో ఒక విషయంలో రాజీ పడాల్సి వస్తుంది... క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు అనే ఉద్దేశ్యంతో ఖర్చు పెట్టేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎవరైనా నిర్మాత ముందుగా అనుకున్న బడ్జెట్‌ తో సినిమాను పూర్తి చేయగలిగితే ఆ నిర్మాత గ్రేట్‌ అని నేను అంటాను.

ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ సమయంలో అనుకున్న బడ్జెట్‌ లో 25 నుంచి 50 శాతం పెరుగుదల అనేది ఉంటుంది. ఆ పెరుగుదల ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం నిర్మాత బాధ్యత. అలా ఎవరైతే ప్లాన్‌ గా చేసుకుంటారో వారే సమర్ధులైన నిర్మాతలు అన్నట్లుగా రాధా మోహన్‌ అన్నారు.

Tags:    

Similar News