శ్రీదేవి చాలా క్లోజ్..అందుకే ద‌ర్శ‌కుడిగా తీసుకుంది!

సీనియ‌ర్ మేక‌ర్ కోదండ‌రామిరెడ్డి అని తెలుస్తోంది. ఎందుంక‌టే ఆయ‌న ఆయ‌నే ఈ విష‌యాన్ని స్వ‌యంగా రివీల్ చేసారు.

Update: 2023-09-22 05:45 GMT

అతిలోక సుంద‌రి శ్రీదేవి అభిమాని కానిది ఎవ‌రు? వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఆరాధించిన న‌టి శ్రీదేవి. శ్రీదేవి భ‌క్తులు ఎంత మంది ఉన్నా! రామ్ గోపాల్ వ‌ర్మ అనే గొప్ప భ‌క్తుడి ముందు అంద‌రూ త‌క్కువ‌నే చెప్పాలి. ఆమెని ఎంత‌గా ఆరాదిస్తాడో? ఆయ‌న‌కు తెలిసినంతంగా ఇంకెవ‌రికీ తెలియ‌ద‌ని ఆయ‌నే అంటాడు. కాబ‌ట్టి వ‌ర్మ అభిమానం..ప్రేమ‌ని బ‌య‌ట వారు క‌నిపెట్ట‌లేనిది. అందుకే శ్రీదేవి గ్లామ‌ర్ గురించి అనేక సంద‌ర్భాల్లో త‌న‌కు న‌చ్చిన కోణంలో చెప్పుకొచ్చే ప్ర‌య‌త్నం చేసారు.

ఇక మిగ‌తా వారి సంగ‌తి ప‌క్క‌న‌బెడితే టాలీవుడ్ లో ద‌ర్శ‌కుడిగా శ్రీదేవి ఎక్కువ‌గా న‌మ్మేది ఎవ‌ర్నీ? అంటే సీనియ‌ర్ మేక‌ర్ కోదండ‌రామిరెడ్డి అని తెలుస్తోంది. ఎందుంక‌టే ఆయ‌న ఆయ‌నే ఈ విష‌యాన్ని స్వ‌యంగా రివీల్ చేసారు. ఆ త‌క‌థ ఏంటో ఆయ‌న మాట‌ల్లోనే... 'నా హీరోయిన్స్ లో శ్రీదేవి గారు నాతో ఎక్కువ చనువుగా ఉండేవారు. తన సొంత సినిమాకి దర్శకుడిగా ఆమె నన్ను పెట్టుకున్నారు.

ఎంతో మంది ద‌ర్శ‌కులు ఉన్నా ఆమె నేను మాత్ర‌మే ఆ సినిమా చేయ‌గ‌ల‌న‌ని న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు. ఆ సినిమాలో హీరో చిరంజీవిగారు. కొంత షూటింగు కూడా పూర్తిచేసాం. కానీ ఆ త‌ర్వాత క‌థ ఇంకా బ‌లంగా ఉంటే బాగుంటుంద‌ని..ఇంకా క‌స‌ర‌త్తు అవ‌స‌ర‌మ‌ని శ్రీదేవి కి చెప్పాను. అందుకు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడుకుండా ఒప్పుకున్నారు. కొంత మందైతే మ‌ధ్య‌లో ఇలా చెబుతున్నావ్? ఏంటి? అని ల‌క్ష ప్ర‌శ్న‌లు అడుగుతారు.

కానీ శ్రీదేవి ఒక్క మాట కూడా అన‌లేదు. ఓ ద‌ర్శ‌కుడిగా నాకు ఇవ్వాల్సినంత గ్యాప్ ఇచ్చారు. కావాల్సినంత స్వేచ్ఛ క‌ల్పించారు. కానీ ఆ సినిమా పూర్తి చేయ‌లేక‌పోయాను. గ్యాప్ తీసుకోవ‌డంతో అది అలాగే ఉండిపోయింది. చేద్దాం అనుకుంటూనే ఆల‌స్యం చేసాం. ఆ త‌ర్వాత పూర్తిగా ఆ సినిమా వ‌దిలేసాం' అని అన్నారు. ఇక చిరంజీవి క‌థానాయ‌కుడిగా కోదండ‌రామిరెడ్డి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News