బుట్ట బొమ్మ స్పెషాలిటీ అదే..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినిమాల పరంగా కాస్త వెనకపడినట్టు అనిపించినా మళ్లీ వరుస ఛాన్సులతో అదరగొట్టేస్తుంది.

Update: 2024-10-13 06:11 GMT

బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినిమాల పరంగా కాస్త వెనకపడినట్టు అనిపించినా మళ్లీ వరుస ఛాన్సులతో అదరగొట్టేస్తుంది. మొన్నటిదాకా తెలుగులో సూపర్ ఫాం కొనసాగించిన ఈ అమ్మడు సడెన్ గా వెనకపడింది. దాని వెనక రీజన్స్ ఏవైనా సరే పూజా బేబీని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. పూజా హెగ్దే తొలి సినిమా మూగమూడి అప్పటికే మోడల్ గా చేస్తూ వస్తున్న అమ్మడిని మిస్ ఇండియా 2009 పోటీల్లో పాల్గొన్నది. ఆ తర్వాత మోడల్ గా కొనసాగుతుండగా మూగమూడి ఛాన్స్ వచ్చింది.


ఇక మరోపక్క తెలుగులో ఒక లైలా కోసం అవకాశాన్ని అందుకుంది. మొహెంజోదారో తో బాలీవుడ్ లో స్టార్ ఛాన్స్ అందుకుంది అమ్మడు. హృతిక్ రోషన్ తో అవకాశం ఆమె కెరీర్ కి ప్లస్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా వల్ల అనుకోని విమర్శలు ఎదుర్కొంది పూజా హెగ్దే. పేరెంట్స్ ది కర్ణాటక అవ్వడం వల్లే సౌత్ సినిమాల్లో కంఫర్ట్ గా నటిస్తున్నానని చెప్పింది పూజా హెగ్దే.


తెలుగులో అమ్మడికి దువ్వాడ జగన్నాథం సినిమాతో తొలి హిట్ దక్కింది. ఇక ఆ తర్వాత అమ్మడి కెరీర్ లో వెనక్కి చూసుకోలేనంత బిజీ అయ్యింది. వరుస స్టార్ ఛాన్సులు పూజాని స్టార్ క్రేజ్ తెచ్చుకునేలా చేయగా రాధే శ్యాం ఫ్లాప్ తో మళ్లీ అమ్మడికి బ్యాడ్ లక్ మొదలైంది. అటు కోలీవుడ్ లో కూడా బీస్ట్ యావరేజ్ గా నిలవడం వల్ల అక్కడ మరో ఛాన్స్ రాబట్టలేకపోయింది. లాస్ట్ ఇయర్ సల్మాన్ ఖాన్ తో చేసిన కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో అమ్మడు మరింత డీలా పడింది.

ఐతే కొద్దిపాటి గ్యాప్ తర్వాత పూజా హెగ్దే మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఇప్పటికే సూర్య 44లో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకున్న అమ్మడు ఈమధ్యనే విజయ్ 69వ సినిమా ఆఫర్ కూడా అందుకుంది. పూజా హెగ్దే లాంటి హీరోయిన్ సినిమాలో ఉంటే గ్లామర్ షోకి ఎలాంటి డౌటు ఉండదు. అందుకే అమ్మడిని అభిమానించే ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. సినిమాలతోనే కాదు సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో కూడా పూజా హెగ్దే అదరగొట్టేస్తుంది. లేటేస్ట్ గా తన బర్త్ డే నాడు వైట్ గౌనులో తన థై షోతో అదరగొట్టేసింది అమ్మడు. బ్లాక్ గాగుల్స్, చేతులో స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ తో పూజా లుక్స్ క్రేజీగా ఉన్నాయి. ఈ బుట్ట బొమ్మ పుట్టినరోజు సందర్భంగా అమ్మడు మరిన్ని సినిమా ఛాన్సులు అందుకోవాలని కోరుతూ హ్యాపీ బర్త్ డే పూజా హెగ్దే అని చెప్పేద్దాం.

Tags:    

Similar News