కోలీవుడ్ బాక్సాఫీస్.. ఈసారి బ్లాస్టింగ్ గట్టిగానే..
ఓ విధంగా చెప్పాలంటే తెలుగు కంటే కోలీవుడ్ మార్కెట్ పెద్దది.
సౌత్ లో టాలీవుడ్ లో ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు వస్తూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కలెక్షన్స్ ప్రభంజనం కురిపించాయి. భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాయి. ఈ ఏడాది కూడా రేసులో అరడజను సినిమాల వరకు ఉన్నాయి. టాలీవుడ్ లో సమానమైన స్టామినా కోలీవుడ్ హీరోలకి కూడా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే తెలుగు కంటే కోలీవుడ్ మార్కెట్ పెద్దది.
అక్కడ స్టార్ హీరోల చిత్రాలకి చాలా ఈజీగా 200 నుంచి 300 కోట్ల కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. అయితే వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ ని మాత్రం ఇప్పటి వరకు ఏ కోలీవుడ్ హీరో టచ్ చేయలేకపోయాడు. కోలీవుడ్ లో ఫస్ట్, సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మీద ఉన్నాయి. రోబో 2.0 రికార్డ్ ని ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
అయితే ఈ ఏడాది మాత్రం ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. దానికి కారణంగా ఏకంగా 8 సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ మూవీస్ కావడం విశేషం. వీటిలో ముందుగా కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న ఇండియన్ 2 ఉంది. ఈ సినిమాపై హైఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో చేస్తోన్న వేట్టయాన్ మూవీ ఉంది.
శివ దర్శకత్వంలో సూర్య చేస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ కంగువ భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అజిత్ హీరోగా విడా మయూర్చి మూవీ తెరకెక్కింది. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఇళయ దళపతి విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తోన్న GOAT మూవీపైన భారీ హైప్ ఉంది.
అలాగే చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోంది. శివ కార్తికేయన్ అమరన్, ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాయాన్ మూవీ కూడా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలు కావడం విశేషం. ఈ చిత్రాలలో కచ్చితంగా ఏదో ఒకటి వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.