లైకా.. ఎన్ని దెబ్బలు బరిస్తారో?

కోలీవుడ్ లైకా ప్రొడక్షన్స్ టాప్ బ్యానర్ అని చెప్పాలి. తమిళనాట భారీ బడ్జెట్ చిత్రాలు తీయడం లైకా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసింది.

Update: 2023-10-01 15:30 GMT

కోలీవుడ్ లైకా ప్రొడక్షన్స్ టాప్ బ్యానర్ అని చెప్పాలి. తమిళనాట భారీ బడ్జెట్ చిత్రాలు తీయడం లైకా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసింది. ఈ ప్రొడక్షన్ విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమాతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది. అదే సినిమాని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ఖైదీ నెంబర్ 150 టైటిల్ తో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా పర్వాలేదని టాక్ తెచ్చుకుంది.

ఈ చిత్రంతో తెలుగులోకి కూడా లైకా ఎంట్రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ నిర్మాణ సంస్థ పూర్తిస్థాయిలో కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా వచ్చిన చంద్రముఖి 2తో లైకా ప్రొడక్షన్స్ 25 సినిమాలు కంప్లీట్ చేసుకుంది. మరో మూడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఈ సంస్థకి చిన్న సినిమాలు మంచి సక్సెస్ ఇస్తూ ఉంటే స్టార్ హీరోలతో చేసే పెద్ద బడ్జెట్ మూవీస్ మాత్రం నష్టాలు తీసుకొస్తున్నాయి.

ఇప్పటి వరకు చూసుకుంటే రోబో 2.0 కలెక్షన్స్ భారీగానే వచ్చిన నిర్మాణ వ్యయం ఎక్కువ కావడంతో నష్టాలు మిగిల్చింది. సూర్య, ఆర్య హీరోలుగా తెరకెక్కిన కురుప్పన్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రజినీకాంత్, మురుగదాస్ కాంబోలో చేసిన దర్బార్ డిజాస్టర్ అయ్యింది. ఇక మణిరత్నంతో దర్శకత్వంలో చేసిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ ని గ్రాండియర్ గా నిర్మించారు.

సిరీస్ లో మొదటి పార్ట్ కొంత వరకు సేఫ్ చేసిన పార్ట్ 2 మాత్రం నష్టాలు తీసుకొచ్చింది. అక్షయ్ కుమార్ తో చేసిన రామ్ సేతు సినిమా డిజాస్టర్ అయ్యింది. తాజాగా చంద్రముఖి అయితే గట్టిగా దెబ్బతీసింది. ఏ భాషలో కూడా మూవీ హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఇప్పుడు ఇండియన్ 2, రజినీకాంత్ లాల్ సలామ్ సినిమాలు ఉన్నాయి.

ఇండియన్ 2 సినిమా చుట్టూఎన్ని వివాదాలు అలుముకున్నాయి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సక్సెస్ కోసం ప్రయత్నం చేసిన ప్రతిసారి లైకా ప్రొడక్షన్స్ కి ఎదురుదెబ్బలు తగులుతునే ఉన్నాయి. అయితే మినిమమ్ బడ్జెట్ తో చేసే సినిమాలు మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంటూ లాభాలు ఆర్జించి పెడుతూ ఉండటం విశేషం.

Tags:    

Similar News