కొరటాల మాట.. సోషల్ మీడియా దుమారం..!

దేవర ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి యువ హీరోలైన సిద్ధు, విశ్వక్ సేన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Update: 2024-09-20 14:36 GMT

దేవర ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి యువ హీరోలైన సిద్ధు, విశ్వక్ సేన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎంతో సరదాగా జరిగిన ఈ ఇంటర్వ్యూలోని కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. దేవర సినిమా కోసం గోవాలో తన ఎక్స్ పీరియన్స్ గురించి వెల్లడించాడు. గోవాలో మండుటెండలో తారక్ పడిన కష్టం రూం కి వెళ్లి ఏసీలో పడుకుందామంటే అక్కడకి వెళ్లగానే కరెంట్ పోయిన సంఘటన చెప్పి సినిమా షూటింగ్ లో ఆ ఒక్క సంఘటన తనను చిరాకు పెట్టేలా చేసిందని అన్నారు.

ఇక మరోపక్క సినిమా కథ గురించి చెబుతూ ఏ సినిమాలో అయినా హీరో ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాడు కానీ దేవరలో భయాన్ని పరిచయం చేస్తాడు. అందుకే దేవర స్పెషల్ మూవీ అన్నారు. ఇక దేవర విషయంలో తను కా ఫిడెంట్లీ నర్వస్ గా ఉన్నానని తారక్ చెప్పారు. ఇదే క్రమంలో కొరటాల శివ తన భయాల గురించి చెబుతూ అకౌంటబిలిటీ ఉండాలని భయపడతానని అన్నారు.

అంతేకాదు తనకు ఇచ్చిన పని సమర్ధవంతంగా చేయడానికి భయపడతానని అన్నారు. ఊరకనే పక్కన వాడిని ఇబ్బంది పెట్టి పని చేయకుండా అడ్డు పడకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలని అన్నారు కొరటాల శివ. ఐతే ఈ మాటలు అన్నీ కొరటాల శివ ఎవరినో ఉద్దేశించి అన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆచార్య టైం లో కొరటాల శివ అనుకున్న కథ ఒకటి అయితే చిరు దాన్ని మరోలా తీయాలని చెప్పడంతో చేసేదేమి లేక వారు చెప్పినట్టే చేశారని కామెంట్స్ వినిపించాయి.

ఆ టైం లో కొరటాల శివ మీద చాలా ఒత్తిడి ఏర్పడింది. దాని నుంచి బయటకు వచ్చి ఎన్టీఆర్ తో దేవర చేశాడు కొరటాల శివ. ఇప్పుడు ఆ సినిమాను ఉద్దేశించే కొరటాల శివ కావాలని ఆ కామెంట్స్ చేశారని చెబుతున్నారు. ఇక్కడ ఆయన ఉద్దేశం అది కాకపోయినా పనిలో డిస్టర్బ్ చేయకూడదు అన్న పదాన్ని పట్టుకుని కొందరు కొరటాలని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. ఏది ఏమైనా జరిగిపోయిన దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కొరటాల శివ కావాలని ఆ పంచ్ వేయకపోయినా సందర్భం బాగా కుదరడంతో ఆచార్య సినిమా మీదే ఈ పంచ్ అనుకుంటూ సోషల్ మీడియాలో అనవసరమైన రచ్చ చేస్తున్నారు.

Tags:    

Similar News