టాలెంటెడ్ హీరో.. ఇది మామూలు టెస్ట్ కాదు..
అతను చేసిన సినిమాలలో కేవలం క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. అంత అద్భుతంగా సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందనే అభిప్రాయం పబ్లిక్ లో ఉంది.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో మంచి నటుడు అనే గుర్తింపు తెచ్చుకున్న వారిలో సత్యదేవ్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. అతని పెర్ఫార్మెన్స్ లో మంచి ఇంటెన్సన్ కనిపిస్తూ ఉంటుంది. ఏ పాత్ర చేసిన దానికి వంద శాతం న్యాయం చేస్తాడు. అతను చేసిన సినిమాలలో కేవలం క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. అంత అద్భుతంగా సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందనే అభిప్రాయం పబ్లిక్ లో ఉంది.
సినీ విశ్లేషకులు కూడా సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. సైడ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సత్యదేవ్ ప్రభాస్ మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలో హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకడిగా నటించాడు. తరువాత సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు. అత్తారింటికి దారేది, ముకుంద సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలలో నటించాడు.
జ్యోతిలక్ష్మి సినిమాలో పూరిజగన్నాథ్ సత్యదేవ్ ని హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో పాటు సత్యదేవ్ టాలెంట్ గురించి కూడా అందరికి పరిచయం అయ్యింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేస్తూ మరో వైపు హీరోగా కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చాడు.
బ్లఫ్ మాస్టర్ మూవీ హీరోగా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో సత్యదేవ్ సక్సెస్ అందుకున్నాడు. హీరోగా అవకాశాలు పెరిగిన కూడా తరువాత చెప్పుకోదగ్గ హిట్స్ అయితే సత్యదేవ్ కి పడలేదు. గాడ్ ఫాదర్ సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్ తో సత్యదేవ్ నటించి మెప్పించాడు.
సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, గాడ్సే, గుర్తుందా శీతాకాలం సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. అయితే ఇవేవీ కూడా అతనికి కమర్షియల్ గా సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం కృష్ణమ్మ మూవీతో సత్యదేవ్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమాకి కొరటాల శివ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. దగ్గరుండి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి స్టార్ దర్శకులు వచ్చి మూవీని ప్రమోట్ చేశారు.
అయితే చెప్పుకోదగ్గ బజ్ క్రియేట్ చేయలేదు. మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన థీయాట్రికల్ గా ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదని తెలుస్తోంది. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న కృష్ణమ్మ మూవీ ఏ మేరకు పబ్లిక్ ని ఎట్రాక్ట్ చేసి థియేటర్స్ వైపు రప్పిస్తుందనేది తెలియాల్సి ఉంది. పబ్లిక్ లో సినిమాపై ఎలాంటి బజ్ లేని నేపథ్యంలో పాజిటివ్ టాక్ వచ్చిన కమర్షియల్ సక్సెస్ అవుతుందా అనేది డౌట్ గానే ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా టాక్ బాగుంటే మాత్రం జనాలు క్యూ కడతారు. చూడాలి మరి టాలెంటెడ్ హీరో ఈ టెస్ట్ లో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో.