మాస్ కా దాస్ కి జోడీగా బుల్లెట్ బేబీ!
ముంబై బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతందనుకున్నారంతా. కానీ అమ్మడి కెరీర్ అలా సాగలేదు.
ముంబై బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతందనుకున్నారంతా. కానీ అమ్మడి కెరీర్ అలా సాగలేదు. `ఉప్పెన`తో అలరించినా? అటుపై నటించిన సినిమాలు వైఫల్యాలు బాట పట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్, మాలీవుడ్ బాట పట్టింది. అక్కడ మాత్రం కాస్త బిజీగానే ఉంది. కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తుంది. అలాగని టాలీవుడ్ కి పూర్తిగా దూరం కాలేదు. అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తోంది.
గత ఏడాది `మనమే` సినిమాతో ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా ఫలితం కూడా నిరాశ పరిచింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో అమ్మడికి మరోసారి కంబ్యాక్ అయ్యే ఛాన్స్ వచ్చింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ సినిమాకి సన్నాహాలు చేస్తోంది. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. వరుస ప్లాప్ లున్నా కృతికి ఇలా అవకాశం రావడం అన్నది అదృష్టమనే చెప్పాలి.
ప్లాప్ భామల్ని హీరోయిన్ గా తీసుకోవడం అన్నది చిన్న విషయం కాదు. అయితే కృతి మంచి పెర్పార్మర్. అందం, అభినయం గల నాయిక. తనలో ఆ లక్షణాలతోనే టాలీవుడ్ లో ఇంకా అవకాశాలు అందుకో గల్గుతుంది. అయితే ఈసారి సక్సస్ అన్నది అత్యంత కీలకం. ప్లాప్ లు కొనసాగిస్తే ఇకపై అవకాశాలు కష్టం. ఇప్పటికే నాయికల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకుని నిలబడటం చిన్న విషయం కాదు.
అయితే విశ్వక్ సేన్ సినిమాలు రిలీజ్ సమయంలో నెగిటివ్ గా మారుతున్నాడు. ఆ ప్రభావం సినిమాల పైనా పడుతుంది. ఇటీవల రిలీజ్ అయిన `లైలా` కంటెంట్ తో ఫెయిలైంది. అంతకు ముందే సినిమాని బోయ్ కాట్ చేయాలన్నది ట్రెండింగ్ లో నిలిచింది. క్షమాపణలు చెప్పినా పనవ్వలేదు. ఈ నేపథ్యంలో తదుపరి సినిమాల విషయంలో విశ్వక్ సేన్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంతే ఉంది.