బేబమ్మ అప్పుడే బోర్ కొట్టేసిందా..?

మొదటి సినిమానే యూత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ కృతి శెట్టి. ఉప్పెనలో బేబమ్మ పాత్రలో అమ్మడి అభినయం ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

Update: 2023-12-11 23:30 GMT

మొదటి సినిమానే యూత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ కృతి శెట్టి. ఉప్పెనలో బేబమ్మ పాత్రలో అమ్మడి అభినయం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. పదహారేళ్ల వయసు సినిమాలో శ్రీదేవిలా అమ్మడిని వర్ణిస్తూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి చేశారు. ఫస్ట్ సినిమా హిట్టైతే ఇక అవకాశాల గురించి చెప్పనక్కర్లేదు. వరుసగా అరడజను సినిమాలు రావడం చక చకా అవన్నీ చేయడం జరిగింది. అయితే ఈ గ్యాప్ లో ఫ్లాపులు కూడా రుచి చూడాల్సి వచ్చింది.

వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్తే కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కథ విషయంలో కాత జాగ్రత్త పడాలన్న ఆలోచన వచ్చే సరికి కెరీర్ ట్రాక్ తప్పింది. ఇప్పుడు మళ్లీ దాన్ని గాడిలో పడేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది కృతి శెట్టి. ప్రస్తుతం శర్వానంద్ సినిమాలో నటిస్తున్న కృతి శెట్టి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. కన్నడలో టోవినో థామస్ తో సినిమా చేస్తున్న కృతి అక్కడ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.

చేసిన 7 సినిమాల్లోనే హిట్ జోష్ ని ఫ్లాప్ తో వచ్చే నిరుత్సాహాన్ని ఎదుర్కొన్న కృతి శెట్టి ఇక మీదట కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలని అనుకుంటుంది. అందుకే ఈమధ్య సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. రీసెంట్ గా ఒక సినిమా తన దాకా వచ్చినా హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేకపోవడం వల్ల కాదనేసిందట.

కృతి శెట్టి మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని ప్రయత్నిస్తుంది. సినిమాల కన్నా ఫోటో షూట్స్ తో ఈమధ్య ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది అమ్మడు. బేబమ్మ పని అయిపోయింది అనుకున్న వారికి రెట్టింపు ఉత్సాహంతో వారికి ఆన్సర్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. తెలుగులో శర్వానంద్ తో సినిమా చేస్తున్న అమ్మడు తమిళంలో జినీ సినిమా చేస్తుంది. ఈ సినిమాలతో అయినా కృతి శెట్టి మళ్లీ ప్రేక్షకుల మనసు గెలుస్తుందేమో చూడాలి. టాలీవుడ్ లో గుడ్ స్టార్ట్ ఇచ్చినా ఆ తర్వాత కెరీర్ నిరాశపరచడంతో మళ్లీ తిరిగి తన సత్తా చాటాలని చూస్తుంది కృతి శెట్టి. ఒక్క ఫ్లాప్ పడగానే హీరోయిన్ ఫేట్ మారిపోతుంది. అందుకే అన్ని విధాలుగా జాగ్రత్త పడాలని చూస్తున్నారు. కృతికి ఆల్రెడీ దెబ్బ తగిలింది కాబట్టి అమ్మడు ఇక మీదట ఆ తప్పు చేసే ఛాన్స్ ఉండదని చెప్పొచ్చు.

Tags:    

Similar News