కుబేర.. మరో చిక్కొచ్చిపడిందే..
ఈ పరిస్థితి ధనుష్ కు పెద్ద ఇబ్బందిగా మారింది. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనేక కారణాలతో వాయిదా పడుతుండటంతో, ఆయన సహనం కోల్పోతున్నారని చెబుతున్నారు.
టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కుబేరా సినిమా అనేక కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రం రెండేళ్లుగా నిర్మాణ దశలో ఉంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తన రేంజ్ ను పెంచేలా ఈ సినిమాను రూపుదిద్దాలని ఎంతో శ్రమిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో, మరో కొత్త సమస్య సినిమా బృందాన్ని ఇబ్బందుల్లో పడేసింది.
ఇటీవల చిత్ర నిర్మాతలు ఈ సినిమా ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతుందని ఒక హీంట్ అయితే ఇచ్చారు. కానీ తాజా పరిణామాలతో ఈ ప్లాన్‌కు అడ్డుకట్ట పడింది. ఈ సినిమా హీరోయిన్ రష్మిక మందన్న వర్కౌట్ చేస్తూ గాయపడ్డారని సమాచారం. వైద్యులు ఆమెకు సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండమని సూచించటంతో, ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఆగిపోయింది. దీంతో సినిమా షూటింగ్ పూర్తయ్యేందుకు మరింత ఆలస్యం కానున్నట్లు కనిపిస్తోంది.
ఈ పరిస్థితి ధనుష్ కు పెద్ద ఇబ్బందిగా మారింది. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనేక కారణాలతో వాయిదా పడుతుండటంతో, ఆయన సహనం కోల్పోతున్నారని చెబుతున్నారు. సాధారణంగా ఒక సినిమా కోసం తన డేట్స్‌ను క్రమంగా ప్లాన్ చేసుకునే ధనుష్, కుబేరా కోసం అనుకున్న దానికంటే రెండు రెట్లు ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. కానీ, ఈ వాయిదాలు ఆయనకు కూడా లైనప్ లో ఉన్న ఇతర ప్రాజెక్టులు ఆలస్యమవడానికి కారణమవుతున్నాయి.
రష్మిక గాయంతో కుబేరా టీమ్ ఎలాంటి ఆలస్యానికి తావివ్వకుండా ముందుకు వెళ్లే మార్గాలు వెతుకుతున్నారు. కానీ, ఆమె పాత్రకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను, పాటలను చిత్రీకరించాల్సిన బాధ్యత ఇంకా మిగిలి ఉంది. నిర్మాతలు ఈ సవాళ్లను అధిగమించి చిత్రాన్ని త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నారు. కానీ, రష్మిక పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల సమయం పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు.
కుబేరా సినిమా ఆలస్యం కావడం అందరి ఆశలను నిరాశగా మార్చింది. వేసవిలో విడుదల చేసేందుకు అనుకున్న ప్రణాళికలు ఇక సాధ్యంకాని స్థితిలో ఉన్నాయి. శేఖర్ కమ్ముల రేంజ్ కు తగ్గ ప్రాజెక్ట్‌గా దీన్ని నిలబెట్టాలని చిత్ర బృందం ఎంత కష్టపడుతుందో, అనుకోని ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ధనుష్ మాత్రం ఈ పరిస్థితుల్లో ఇతర ప్రాజెక్టులు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం.