భోళా.. ఆ ఒక్క సీనే దారుణమైన దెబ్బ
చిరు వయసుకు, ఆయన స్థాయికి ఇది అస్సలు సెట్ కాలేదంటూ విమర్శిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్' అంచనాలను అందుకోలేకపోయింది. ఆగస్ట్ 11న రిలీజైన ఈ చిత్రం ఊహించని డివైడ్ టాక్ తో అటు మెగా అభిమానులను ఇటు సినీ ప్రియులను మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మేనరిజాన్ని, ఆయనకు సంబంధించిన సీన్స్ ను రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
మొదటి నుంచి ఈ సినిమాతో పాటు పవన్ సన్నివేశాలను చిరు ఎలా చేశారో చూడాలనే ఆసక్తితో అభిమానులు ఎంతో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజైన తర్వాత ఆ సీన్స్ ను చూసిన ఫ్యాన్స్, సినీ ప్రియులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవి చిరుకు సెట్ కాలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఖుషి సినిమాలోని నడుము సీన్ ను తెగ ట్రోల్ చేస్తన్నారు. చిరు వయసుకు, ఆయన స్థాయికి ఇది అస్సలు సెట్ కాలేదంటూ విమర్శిస్తున్నారు. ఈ సన్నివేశంలో శ్రీముఖి నల్ల చీర కట్టుకుని బెంచ్ పై కూర్చుని బుక్ చదువుతూ ఉండగా.. పక్కనే ఉన్న ఫ్యాన్ గాలికి ఆమె చీరకొంగు పైకి ఎగిరి నడుము కనిపిస్తుంటుంది.
అప్పుడే శ్రీముఖి పక్క బెంచ్ పై కూర్చుని డబ్బు లెక్కపెడుతున్న చిరంజీవి.. గ్లాసులో నీళ్లు తాగుతూ ఆమె నడుము చూస్తారు. చిరు నడుము చూడటాన్ని గమనించిన శ్రీముఖి సీరియస్ గా కొంగు సర్దుకుంటుంది. కానీ మళ్లీ ఫ్యాన్ గాలికి చీర కొంగు ఎగరడంతో చిరు చూస్తారు. అది చూసిన శ్రీముఖి.. భోళాజీ అని పిలుస్తూ నువ్ చూసినవ్ అంటుంది. హా.. చూసినా.. లేకపోతే లెక్కలు తప్పుతాయి కదా.. అంటూ ఈ ఖుషి సీన్ కొనసాగుతుంది. ఈ సీన్ కు థియేటర్లో ఈలలు, గోలలు వచ్చినప్పటికీ.. నెట్టింట్లో ట్రోల్ కూడా అవుతోంది.
చిరంజీవి ఈ వయసులో ఇలాంటి సన్నివేశాన్ని చేయడం, పైగా ఈ సీన్ లో ఆయన ఇచ్చిన హవాభావాలు.. ఫ్యామిలీ ఆడియెన్స్, కొంతమంది అభిమానులకు రుచించలేదని కామెంట్స్ పెడుతున్నారు. సినిమా ఫైనల్ కట్ లోనూ చిరు దీన్ని తొలిగించి ఉండాల్సిందేమో అంటున్నారు. వాస్తవానికి సినిమా రిలీజ్ కు ముందే ఓ గ్లింప్స్ లో పవన్ స్టైల్ తరహాలో మెడ రుద్దుకుంటూ హ హ అనే మేనరిజంను చిరు అనుకరించగా దానికి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.