బజ్జీల పాప సూపర్ రీల్స్.. చూస్తే దిమ్మదిరగాల్సిందే!
అలాంటి వారిలో కుషితా కల్లపు ముందు వరుసలో ఉంటుంది. అయితే కుషితా కల్లపు అంటే చాలా వరకు గుర్తుపట్టలేకపోవచ్చు
సోషల్ మీడియాలో ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు అవకాశాల కోసం తెగ అందాలు ఆరబోస్తుండగా, మరికొందరు అవకాశాలు లేక సోషల్ మీడియాలో కేక పెట్టించే రేంజ్లో కాక పుట్టిస్తున్నారు. కొత్త కొత్త రీల్స్, ఫొటోలు, వీడియోలతో ట్రెండింగ్ లో ఉంటున్నారు బ్యూటీలు.
అలాంటి వారిలో కుషితా కల్లపు ముందు వరుసలో ఉంటుంది. అయితే కుషితా కల్లపు అంటే చాలా గుర్తుపట్టలేక పోవచ్చు. బజ్జీల పాప అంటే వెంటనే ఐడియా వచేస్తోంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని ఓ పబ్ మీద దాడి జరిగిన సమయంలో ఇక్కడికి ఎందుకొచ్చారని అడిగితే.. ఛీజ్ బజ్జీలు తినడానికి వచ్చినట్లు ఆమె చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆమె బజ్జీల పాపగా మారిపోయింది
అప్పటి నుంచి సోషల్ మీడియాతో పాటు సినీ ఇండస్ట్రీ లో ఫుల్ పాపులర్ అయిపోయింది కుషితా కల్లపు. అంతకుముందు తెగ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిన అమ్మడు.. ఇక సినిమాలపై దృష్టి పెట్టింది. మెయిన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మూడు సినిమాల్లో నటించింది. గోపీచంద్ రామబాణం సినిమాలో కూడా యాక్ట్ చేసింది. తాజాగా మహేశ్ బాబు గుంటూరు కారం మూవీలో ఛాన్స్ కొట్టేసింది.
అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. తన అందచందాలతో అలరిస్తుంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్ లు ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటోంది. ట్రెండింగ్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటోంది. మోడ్రన్ తో పాటు పొట్టి డ్రెస్సు ల్లో ఫొటోలు దిగుతూ రచ్చ రచ్చ చేస్తోంది. కుర్రకారును ఫిదా చేస్తుంటోంది.
తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన రెండు రీల్స్ కుషితా కల్లపు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. పొట్టి గౌనుల్లో అందాలను ఆరబోసింది ఈ బ్యుటీ. గ్లామరస్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ యానిమల్లోని సూపర్ సాంగ్ తో పాటు ఓ ఇంగ్లీష్ సాంగ్‌కు రీల్ చేసి పోస్ట్ చేసింది. తన ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్ల మనుసులను కొల్లగొడుతోంది.
తన చూపులతోనే అద్దరగొట్టేసింది. ప్రస్తుతం ఈ రెండు రీల్స్ వైరల్‌గా మారాయి. కుషిత గ్లామర్ షో చూసి ప్రతి ఒక్కరూ మైమరచిపోతున్నారు. కుషిత అందచందాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్, టాలెంట్ ఉన్న ఈ ముద్దుగుమ్మ రానున్న రోజులలో మంచి స్టార్ హీరోయిన్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.