ఈ వారం ఓటీటీ బెస్ట్ మూవీస్ ఇవే!

భారతదేశంలో అందుబాటులో ఉన్న ఓటీటీ సంస్థలు అన్నీ ప్రతి వారం సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి.

Update: 2024-10-18 08:18 GMT

గతంలో కంటే ఇప్పుడు ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యామిలీ మొత్తం సినిమా థియేటర్ల చుట్టూ తిరగడం కంటే ఇంట్లోనే ఎంచక్కా కూర్చుని మూవీలు చూడడానికి సినీ ప్రియులు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఓటీటీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో ఈ సంస్థలన్నీ కొత్త కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.

భారతదేశంలో అందుబాటులో ఉన్న ఓటీటీ సంస్థలు అన్నీ ప్రతి వారం సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇలా ఈ వారంలో కూడా చాలా చిత్రాలు, సిరీస్‌లు ఆడియెన్స్ ముందుకు వచ్చేశాయి. అందులో కొన్ని మాత్రం అదిరిపోయే కంటెంట్‌తో అందరి మన్ననలు పొందుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమానే ‘మత్తు వదలరా 2’.

శ్రీ సింహా కోడూరి హీరోగా, సత్య మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమానే ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా తీసిన ఈ మూవీ థియేటర్లలో అదిరిపోయే స్పందనను అందుకుంది. తద్వారా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఇక, తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న బెస్ట్ మూవీస్‌లో ‘లాఫింగ్ బుద్దా’ మరొకటి. ఒక చిన్న పట్టణంలో కానిస్టేబుల్‌గా పని చేసే వ్యక్తి.. లావుగా ఉండడం వల్ల ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో తన ఉద్యోగం కాపాడుకోవడానికి ఏ పనులు చేశాడు అన్న కథతో వచ్చిన ఈ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. దీనికి కూడా ఆడియెన్స బ్రహ్మరథం పడుతున్నారు.

ఇండియన్ మూవీలతో పాటు హాలీవుడ్‌ నుంచి వచ్చిన చిత్రాలు కూడా ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అందులో Longlegs అనే క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ కూడా అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. ఇందులో ఎన్నో ట్విస్టులు, టర్న్‌లు ఉండడంతో దీనికి మంచి స్పందన దక్కుతోంది. మంచి క్రైమ్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి.

ఇక, బెస్ట్ కంటెంట్‌తో వచ్చిన వెబ్ సిరీస్‌లు కూడా ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సిరీస్ ‘The Lincoln Lawyer 3’. హత్య కేసును ఛేదించే కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి కూడా రెస్పాన్స్ బాగానే లభిస్తోంది. వీటితో పాటు అమెజాన్‌లో ‘లెవెల్ క్రాస్’, నెట్‌ఫ్లిక్స్‌లో Jurassic World Chaos Theory: Season 2, బుక్ మై షోలో Beetlejuice Beetlejuice, డిస్నా ప్లస్ హాట్‌స్టార్‌లో 1000 Babiesలు కూడా ఈ వారంలో బెస్ట్ వాచ్‌గా ఉన్నాయి.

Tags:    

Similar News