రజనీ కోసం విలన్‌గా బిగ్ టాలెంటెడ్ స్టార్
స్వతహాగానే రజిని అభిమాని అయిన లారెన్స్.. రజినీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పట్నుంచో భావిస్తున్నానని చాలా చెప్పారు.
రీసెంట్గా జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఈ సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో మొదట టీజె జ్ఞానవేల్‌తో తలైవర్ 170 సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రంతో పాటు తలైవర్ 171 కూడా షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరో రాఘవ లారెన్స్ విలన్‌గా నటించబోతున్నారని తెలిసింది.
వివరాళ్లోకి వెళితే.. రజనీ కాంత్ తలైవర్171 చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎల్సీయూలో భాగంగా కాకుండా స్టాండ్అలోన్గా తెరకెక్కించబోతున్నారు లోకేశ్. తాజగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో విలన్‌గా రాఘవ లారెన్స్ నటిస్తున్నారనే వార్త తమిళ్ మీడియాలో తెగ హల్ చల్ అవుతోంది. స్వతహాగానే రజిని అభిమాని అయిన లారెన్స్.. రజినీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పట్నుంచో భావిస్తున్నానని చాలా చెప్పారు. ఇప్పుడు లోకేశ్ కనగరాజ్.. రజినీతో చేస్తున్న సినిమాలో ఒక పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ ఆఫర్ ఇచ్చారని, ఇక రజినీతో సినిమా అనగానే విలన్ రోల్ అయినా సరేనని లారెన్స్ ఓకే చెప్పారని కథనాలు వస్తున్నాయి.
కానీ ఈ వార్తపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. అయితే లోకేశ్ కనగరాజ్ సినిమాల్లో హీరోలు విలన్‌గా నటించడం కామన్. పైగా వాళ్లని హీరోతో సమానంగా ఎలివేట్ చేస్తుంటారు లోకేశ్. దీంతో లారెన్స్ విలన్‌గా నటిస్తున్నారన్న వార్తలు వినగానే.. లోకి లారెన్స్‌ను ఏ రేంజ్‌లలో చూపిస్తారన్న అంశంపై సినీ ప్రియులు ఇప్పటి నుంచి ఊహించడం ప్రారంభించేశారు.
కాగా, లోకేశ్ రీసెంట్గా ఎల్సీయూలో భాగంగా లియోతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా డీసెంట్ టాక్‌ను అందుకుని సంచలన వసూళ్లను అందుకుంది. ఇక రాఘవ లారెన్స్.. ఇటీవలే చంద్రముఖి 2తో వచ్చి డిజాస్టర్టాక్ను అందుకున్నారు. త్వరలోనే ఆయన జిగర్తాండ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.