లెజెండ్ 2లో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లో

ది లెజెండ్ తర్వాత లెజెండ్ సీక్వెల్ కోసం శరవణన్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నార‌ని స‌మాచారం. దర్శకుడు దురై సెంథిల్‌కుమార్ అత‌డి పాత్ర‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు.

Update: 2024-12-09 19:30 GMT

లెజెండ్ శరవణన్ నటిస్తున్న `లెజెండ్ 2` ప్రస్తుతం జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో యాక్ష‌న్ డోస్ రెట్టింపు ఉంటుంద‌ని స‌మాచారం. శరవణన్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ లు తెర‌కెక్కించారు. ఇది ప్రాజెక్ట్ స్థాయిని మ‌రింత‌గా పెంచింద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. చెన్నై - తూత్తుకుడిలో షూటింగ్ జరుపుకున్న తరువాత, జార్జియా షెడ్యూల్ లో అత్యంత కీల‌క భాగం చిత్రీక‌రిస్తున్నారు. ఇది షూటింగ్ లో ఒక కీల‌క‌దశను సూచిస్తుంది. పాయల్ రాజ్‌పుత్, షామ్, ఆండ్రియా జెరెమియా త‌దిత‌రులు శరవణన్‌తో కలిసి నటించారు.

 

ది లెజెండ్ తర్వాత లెజెండ్ సీక్వెల్ కోసం శరవణన్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నార‌ని స‌మాచారం. దర్శకుడు దురై సెంథిల్‌కుమార్ అత‌డి పాత్ర‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. కక్కి సట్టై, గరుడన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెర‌కెక్కించిన దురై సెంథిల్‌కుమార్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఆకర్షణీయమైన కథనాన్ని మిళితం చేయడంలో నిపుణుడు. అత‌డు లెజెండ్ 2 ని ఉన్న‌త స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా `లెజెండ్ 2` అని టైటిల్ నిర్ణ‌యించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఇందులో శ‌ర‌వ‌ణ‌న్ పాత్ర‌ను లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హాలో చూపిస్తున్నార‌ని తెలిసింది. రాజీ లేని బ‌డ్జెట్ తో నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకుంటాయి.

 

ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో శ‌ర‌వ‌ణ‌న్ హార్డ్ వ‌ర్క్ ని తాజాగా విడుద‌ల చేసిన‌ తెరవెనుక ఫోటోలు, వీడియోలో ప్ర‌ద‌ర్శించారు. జార్జియా లో ఇటీవల కొన్నేళ్లుగా తమిళ చిత్రాలను ఎక్కువ‌గా తెర‌కెక్కిస్తున్నారు. మృగం, చంద్రముఖి 2, ధృవ నచ్చతిరమ్ వంటి విజయవంతమైన చిత్రాలను కూడా అక్కడ చిత్రీకరించారు. ఇప్పుడు లెజెండ్ 2ని ఈ అంద‌మైన లొకేష‌న్ లో చిత్రీక‌రించారు.

 

 

లెజెండ్ శరవణన్ స‌ర‌స‌న పాయల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో షామ్ , ఆండ్రియా జెర్మియా స‌హా ప‌లువురు తార‌లు న‌టిస్తున్నారు. మొదటి దశ షూటింగ్ చెన్నైలో జరిగింది. లెజెండ్ శరవణన్ స్వగ్రామం తూత్తుకుడిలో మరో ప్రధాన షెడ్యూల్ ని చిత్రీక‌రించారు.

Tags:    

Similar News