'లియో' టాక్ పై లోకేష్ ఏం చెప్పబోతున్నాడు?
తదుపరి చిత్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను' అని అన్నారు. దీన్నిపై సినిమా ఫుల్ రన్ అనంతరం లోకేష్ తప్పకుండా వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
విజయ్-లొకేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన' లియో' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలిరోజే సినిమా ఏకంగా 140 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. ఇప్పటివరకూ మొత్తం వసూళ్ల లెక్క 300 కోట్లగా తేలింది. విజయ్-లోకేష్ క్రేజ్ నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఓ రికార్డు. అయితే సినిమాపై తొలి షోతోనే నెగిటివిటీ కూడా తెరపైకి వచ్చింది.
'విక్రమ్' సినిమాతో పోల్చుతూ కామెంట్ల వర్షం కురిపించారు. కథ..కథనాలు బాగున్నప్పటికీ ఊహించిన స్థాయిలో సినిమా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా చాలావరకూ రొటీన్ గానే ఉంది తప్ప..అందులో లోకేష్ మార్క్ సినిమా కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ కామెంట్లపై లోకేష్ స్పందించాడు. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందంగా ఉంది.
అయినా ప్రేక్షకుల అభిప్రాయం కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాను. వాళ్ల నుంచి వచ్చే కామెంట్లు అన్నింటిని విశ్లేషించుకుంటా. తదుపరి చిత్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను' అని అన్నారు. దీన్నిపై సినిమా ఫుల్ రన్ అనంతరం లోకేష్ తప్పకుండా వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది. లొకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'ఖైదీ'..'విక్రమ్' లాంటి సినిమాలు పాన్ ఇండియాలో సంచలనం సృష్టించడంతో అతడి సినిమాలు మార్కెట్ లో బ్రాండ్ అయిపోయాయి.
హీరో ని మించి లోకేష్ పేరు పాపులర్ అయింది. ఆ క్రేజ్ తోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. అన్ని చోట్ల హౌస్ పుల్ బోర్డులు కూడా పెట్టేసారు. కానీ బాలయ్య సినిమా 'భగవంత్ కేసరి'తో పొల్చితే 'లియో' వీక్ గానే ఉందని చాలా కామెంట్లు వినిపించాయి. తమిళనాడులోనే 'లియో' 100 కోట్లకు పైగానే రాబట్టింది.
ఇలాంటి సమయంలో లోకేష్ కామెంట్లపై స్పందిస్తే అది వసూళ్ల పై ప్రభావం చూపిస్తుంది. ఫుల్ రన్ లో ఇంకా చాలా మంది అభిప్రాయపడే అవకాశం కూడా ఉంది. వాటన్నింటిపై లోకేష్ తుదిగా వివరణ ఇవ్వనున్నారు. మరి ఆయన లియో నెగిటివ్ కామెంట్లపై ఎలా స్పందిస్తారు? అన్నది చూడాలి.