లియో.. ఉన్న బజ్ పోగొడుతున్నారుగా..

రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమా రికార్డులు విజయ్ చాలా తొందరగానే బ్రేక్ చేస్తాడు అని కూడా అందరూ అనుకుంటున్నారు.

Update: 2023-10-03 11:45 GMT
లియో.. ఉన్న బజ్ పోగొడుతున్నారుగా..
  • whatsapp icon

కోలీవుడ్ స్టార్ విజయ్ నుంచి రాబోతున్న తదుపరి సినిమా లియో పై మొదట అంచనాలు గట్టిగానే పెరిగాయి. దర్శకుడు లోకేష్ కనగరాజు విక్రమ్ సినిమా తర్వాత డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అటు తమిళంలోనూ ఇది తెలుగులోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ కి క్రియేట్ చేస్తుంది అనే కామెంట్స్ కూడా వినిపించాయి.

రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమా రికార్డులు విజయ్ చాలా తొందరగానే బ్రేక్ చేస్తాడు అని కూడా అందరూ అనుకుంటున్నారు. మొదట ఈ సినిమాకు సంబంధించిన గాసిప్స్ కూడా అంచనాల స్థాయిని పెంచేశాయి. కానీ ఎప్పుడైతే రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తూ పోస్టర్స్ విడుదల చేశారో అప్పుడే సినిమాపై బజ్ తగ్గుతూ వస్తోంది.

పోస్టర్లు ఎలా ఉన్నాయి అనే సంగతి పక్కన పెడితే.. ట్రోలింగ్ కూడా గురిచేస్తున్నాయి. విజయ్ పాత సినిమాలకు సంబంధించిన సీన్స్ కూడా మళ్లీ ఈ విధంగానే ఉన్నాయి అంటూ ట్రోలర్స్ ఒక రేంజ్ లో ఆట ఆడుకుంటున్నారు. ఇక మొదటి నుంచి ఈ విధంగా ట్రోలర్స్ వస్తున్నప్పటికీ కూడా చిత్ర యూనిట్ సభ్యులు వారికి దీటుగా అయితే పవర్ఫుల్ కంటెంట్ ను విడుదల చేయడం లేదు.

రీసెంట్గా వచ్చిన మరొక పోస్టర్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో సినిమాపై ఉన్న బజ్ వీళ్లే తగ్గించేస్తున్నారు అన్నట్లుగా కూడా కొంతమంది ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. లోకేష్ ఈ ఒక్క విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు అని అంటున్నారు. లోకేష్ మల్టీపర్స్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమాను కథను రాసుకున్నాడు. దానివల్లే అంచనాల స్థాయి అమాంతంగా పెరిగిపోయింది.

ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో నార్త్ లో కూడా సినిమాపై కాస్త హైప్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ పోస్టర్స్ మాత్రం మళ్లీ ఆసక్తిని తగ్గిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుని మళ్లీ బజ్ పెరిగే విధంగా మరికొన్ని పోస్టర్లు విడుదల చేస్తే బెటర్ అని అభిప్రాయాలు వస్తున్నాయి. మరి దర్శకుడు లోకేష్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ ను విడుదల చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News