'లియో'.. అత్యుత్సాహం చూపించి చిక్కుల్లో పడ్డారు

అయితే తాజాగా దళపతి విజయ్ నటించిన లియో విషయంలో మాత్రం కొందరు ఎగ్జిబిటర్లు అత్యుత్సాహం చూపించి ఇరుక్కున్నారు.

Update: 2023-10-10 14:01 GMT

థియేటర్​లో ప్రదర్శితమయ్యే ఏ కంటెంట్​కు అయినా సెన్సార్​ తప్పనిసరి. ఎందుకంటే అది పబ్లిక్ ఎగ్జిబిషన్ కిందకే వస్తుంది. అసభ్యత, హింస ఏదీ మితిమీరకుండా ఉండేంలా ఈ సెన్సార్ చూస్తుంది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోకుండా ఏమైన ప్రదర్శన చేస్తే.. కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది.

ఆ మధ్య నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 'నా సామి రంగా'కు సెన్సార్​ పర్మిషన్ లేకపోవడం వల్ల.. కేవలం ఆన్ లైన్​కు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దళపతి విజయ్ నటించిన లియో విషయంలో మాత్రం కొందరు ఎగ్జిబిటర్లు అత్యుత్సాహం చూపించి ఇరుక్కున్నారు. దీంతో వారికి లీగల్ నోటీసులు వచ్చాయి.

మూడు రోజుల క్రితం లియో మూవీ ట్రైలర్ విడుదల అయింది. అయితే తమిళనాడులోని పలు థియేటర్లలో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ ప్రచార చిత్రాన్ని డైరెక్టర్​గా పబ్లిక్ స్క్రీనింగ్ చేశారు. పైగా ఈ ప్రచార చిత్రంలో ఓ అభ్యంతకర పదం, హింసాత్మక దృశ్యాలు కూడా ఉన్నాయి. థియేటర్​కు వచ్చిన జనాలు ఫొటలు, వీడియోలు తీసి వాటిని షేర్​ నెట్టింట్లో షేర్ చేశారు. ఇది కాస్తా సెన్సార్ బోర్డు దృష్టికి వెళ్ళింది.

దీంతో తమ అనుమతి లేకుండా ఎలా ప్రదర్శిస్తారని వివరణ కోరుతూ.. నోటీసులు పంపింది సెన్సార్​. దీంతో షాక్ తినడం యాజమాన్యాల వంతైంది. ఇప్పుడు దానికి వివరణ ఎలా ఇవ్వాలో తెలీక థియేటర్ యాజమాన్యం తర్జన భర్జన పడుతున్నారు. కాబట్టి.. ఫ్యాన్స్ డిమాండ్ చేశారనో లేదా క్రేజ్ వస్తుందనో ముందు వెనకా చూసుకోకుండా ఇలాంటివి చేస్తే.. ఇలానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.

కాగా, లియో సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సినిమా ఫుల్​ రన్‌టైన్‌ 2 గంటల 44 నిమిషాలు. మొత్తం 13 చిన్న మార్పులను సెన్సార్‌ బోర్డు సూచించింది. ముఖ్యంగా రక్తం, హింస కనిపించే సన్నివేశాల్లో తొలిగించాలని చెప్పింది. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News