లక్కీ భాస్కర్.. ఓపెనింగ్స్ ఎంతంటే?
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగులో రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగులో రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రం.. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా భారీ అంచనాలు నెలకొనగా.. వాటిని మూవీ అందుకుంది. ఆడియన్స్ నమ్మకాన్ని తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది.
అక్టోబర్ 30న లక్కీ భాస్కర్ ప్రీమియర్స్ పడగా.. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. అదే సమయంలో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఆ విషయాన్ని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12.7 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిపారు. దీపావళి బ్లాక్ బస్టర్ అని చెప్పారు. రెండో రోజు కూడా సాలిడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో దుల్కర్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలైన చిత్రంగా లక్కీ భాస్కర్ నిలిచింది. ఇప్పుడు సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తూ రాణిస్తోంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రూ.40 లక్షలు, కర్ణాటకలో రూ.2 లక్షలు వసూలు చేసినట్లు వినికిడి. ఎన్నడూ లేనంతగా కేరళలో దుల్కర్ తెలుగు మూవీ డబ్డ్ వెర్షన్ రూ.2 కోట్లు సాధించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. 1980-90ల్లో బ్యాంకింగ్ సెక్టార్ బ్యాక్ డ్రాప్ తో వెంకీ అట్లూరి తెరకెక్కించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా భాస్కర్ కనిపించారు. ఆయన సతీమణి సుమతి పాత్రలో మీనాక్షి చౌదరి ఫిదా చేశారు. ఎటువంటి హంగులు లేకుండా ఒక మిడిల్ క్లాస్ మాన్ జీవితాన్ని వెంకీ అట్లూరి తెరకెక్కించగా.. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
బ్యాంకు ఉద్యోగి భాస్కర్ (దుల్కర్) చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ బాధ్యతల వల్ల అనేక చోట్ల అప్పులు చేస్తారు. ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఉత్తమ ఉద్యోగి అనే పేరు మాత్రమే వస్తుంది. దీంతో కుటుంబం కోసం ఏదైనా రిస్క్ చేద్దామనుకుంటారు. మరి భాస్కర్ ఎలాంటి రిస్క్ చేశారు? చివరకు ఏమైందనేది పూర్తి సినిమా. మరి చిత్రాన్ని మీరు చూశారా లేదా?