కొడుక్కి మాధవన్ ఇచ్చే సలహా ఇదే!
ఇప్పటికే చాలా పోటీల్లో పాల్గొని దేశానికి మెడల్స్ కూడా తీసుకొచ్చాడు వేదాంత్.
ప్రముఖ నటుడు మాధవన్ నటన గురించి, ఆయన టాలెంట్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తండ్రి బాటలోనే తన కొడుకు వేదాంత కూడా తన టాలెంట్ తో దూసుకెళ్తున్నాడు. కాకపోతే తండ్రిలా సినీరంగంలో కాదు క్రీడా రంగంలో. వేదాంత్ మాధవన్ నేషనల్ లెవెల్ స్విమ్మర్. ఇప్పటికే చాలా పోటీల్లో పాల్గొని దేశానికి మెడల్స్ కూడా తీసుకొచ్చాడు వేదాంత్.
మలేషియన్ ఓపెన్ లో పాల్గొని గోల్డ్ మెడల్స్ అందుకున్న కొడుకు విషయంలో తానెంతో గర్వంగా ఉన్నట్టు మాధవన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఎవరైనా వేదాంత్ గురించి గొప్పగా చెప్తుంటే తనకెంతో సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా మాధవన్ అన్నాడు. బయటి వాళ్లెవరైనా తన వర్క్ నచ్చిందని చెప్పే దాని కంటే వేదాంత్ గురించి మాట్లాడి తన ప్రతిభను గుర్తిస్తే తనకెంతో సంతోషంగా, స్పెషల్ గా ఉంటుందని మాధవన్ తెలిపాడు.
వేదాంత్ కు మీరేమైనా సలహాలిస్తారా అని అడిగితే దాని గురించి పలు విషయాల్లో వేదాంత్ కు సూచనలిస్తుంటానని మాధవన్ చెప్పాడు. అదృష్టమో, దురదృష్టమో నువ్వు నా కొడుకుగా ఉండటం వల్ల సొసైటీలో నీకొక ఐడెంటిటీ వచ్చిందని, దాని వల్ల అందరూ నిన్ను అబ్జర్వ్ చేస్తుంటారని, చిన్న తప్పు చేసినా నువ్వు నేషనల్ న్యూస్ అయిపోతావు కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటానని మాధవన్ తెలిపాడు.
మాధవన్ కొడుకువి అయినందువల్ల నువ్వందరిలా సరదాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లలేవని, ఇష్టమైన అన్ని పనులు చేయలేవని ఇవన్నీ నువ్వు భరించాల్సిందేనని ఖాళీ దొరికిన ప్రతీసారీ వేదాంత్ కు చెప్తుంటానని మాధవన్ చెప్పాడు. ఏదేమైనా అందరిలా కొడుకుని సినీ రంగంలోకి తీసుకుని రాకుండా స్పోర్ట్స్ లోకి పంపడంపై మాధవన్ ను అందరూ ప్రశంసిస్తూ ఉంటారు. మాధవన్ విషయానికొస్తే ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా కెరీర్లో ముందుకెళ్తున్నాడు.