కల్కి : మహాభారతం పోర్షన్‌ మ్యూజిక్‌ అదుర్స్‌

కల్కి సినిమాలో టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.

Update: 2024-06-26 12:29 GMT

ఇండియన్ సినీ ప్రేక్షకులు గత కొన్ని వారాలుగా ఇంకా ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్ లలో సందడి చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్‌ స్థాయి స్క్రీన్స్ లో మరి కొన్ని గంటల్లో స్క్రీనింగ్‌ అవ్వబోతున్న కల్కి సినిమా గురించిన విషయాలు అంచనాలను, ఆసక్తిని అంతకంతకు పెంచుతున్నాయి.

కల్కి సినిమాలో టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఆ మధ్య చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగానే కల్కి లో మహాభారతం కు సంబంధించిన కొన్ని ఘట్టాలు ఉంటాయని, వాటిని ప్రేక్షకులు చూసినప్పుడు థ్రిల్‌ అవుతారు అంటూ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ కల్కి సినిమాలో మహాభారతం పోర్షన్‌ ఎలా ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ మరింత ఆసక్తిని పెంచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. కల్కి సినిమాలోని మహాభారతం పోర్షన్ కి సంగీతం అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.

సినిమాలోని మహాభారతం పోర్షన్‌ కి తగ్గట్లుగా మ్యూజిక్ ను అందించాను. చాలా బాగా వచ్చిందని అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. మహాభారతం పోర్షన్‌ కి నేను ఇచ్చిన మ్యూజిక్‌... మగధీర మరియు బాహుబలి సినిమాలకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్‌ కు నివాళి లాంటిది అన్నారు.

సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్‌ చేసిన వ్యాఖ్యలతో సినిమా పై అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌, నాని, దుల్కర్‌ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్‌ ఉండటం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

Tags:    

Similar News