మ‌హేష్ కంటే ముందే కుర్ర‌హీరోల దూకుడు

మాస్ ఆడియెన్‌లో 'దూకుడు' చూపించ‌డంలో మ‌హేష్ త‌ర్వాతే. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించే స‌త్తా ఉన్నోడు మ‌హేష్

Update: 2024-02-11 12:30 GMT

మాస్ ఆడియెన్‌లో 'దూకుడు' చూపించ‌డంలో మ‌హేష్ త‌ర్వాతే. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించే స‌త్తా ఉన్నోడు మ‌హేష్. సంక్రాంతి బ‌రిలో విడుదలైన గుంటూరు కారం రొటీన్ స్ట‌ఫ్ తో వ‌చ్చినా ప్ర‌జ‌లు ఆదరించారంటే మ‌హేష్ పై ఉన్న అభిమానంతోనే అన‌డంలో సందేహం లేదు. అయితే ఇన్నాళ్లు మ‌హేష్ లోక‌ల్ కంటెంట్ ఉన్న సినిమాలకే ప‌రిమిత‌మ‌య్యాడు. త‌నకంటే ముందే అర‌డ‌జ‌ను పైగా హీరోలు పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని అందుకుని స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదిగేస్తున్నారు. కానీ మ‌హేష్ పాన్ ఇండియాలో దూకుడు చూపించ‌డంలో చాలా ఆల‌స్య‌మ‌య్యాడ‌ని అభిమానులు భావిస్తున్నారు.

ప్ర‌భాస్- చిరంజీవి (సైరా)- రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్- అల్లు అర్జున్ ఇప్ప‌టికే పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత నిఖిల్, అడివి శేష్ లాంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్లో స‌త్తా చాటారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ నుంచి మంచి వ‌సూళ్లు తేగ‌లిగిన హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవ‌లే నేటిత‌రం హీరో తేజ స‌జ్జా అనూహ్యంగా హ‌నుమాన్ సినిమాతో పాన్ ఇండియాలో ఓ వెలుగు వెలిగిపోయాడు.

త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓజీతో పాన్ ఇండియా మార్కెట్లో అడుగు పెట్టేస్తున్నారు. అయితే వీళ్లంద‌రి కంటే చాలా ఆల‌స్యంగా పాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేస్తున్న హీరోగా మ‌హేష్ రేసులో వెన‌క‌బ‌డ్డాడ‌ని విశ్లేషిస్తున్నారు. సౌత్ సూప‌ర్ స్టార్ గా గొప్ప స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్న మ‌హేష్ ఇక‌పై హిందీ స‌హా ఇత‌ర మార్కెట్ల‌లోను స‌త్తా చాటాల్సి ఉంటుంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న త‌దుప‌రి చిత్రంతో దీనిని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. రాజమౌళితో ప్రతిష్టాత్మక SSMB 29 మూవీ ని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మ‌హేష్ లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో, ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో అసాధార‌ణ వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News