మహేష్ రెమ్యునరేషన్.. జక్కన్న లెక్క తప్పిందే..
సాధారణంగా రాజమౌళి ఎలాంటి సినిమా చేసిన కూడా హీరోలకు మిగతా ఆర్టిస్టులకు అందరికీ కూడా ఒక ఫిక్స్ డ్ రెమ్యునరేషన్ అయితే ఉంటుంది.
దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో చేయబోతున్న బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని ఫాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న ఈ కాంబినేషన్ మొత్తానికి ఇప్పుడు సెట్స్ పైకి రాబోతోంది.
ఇక ఈ సినిమా సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి. ఇంకా అధికారికంగా టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వకముందే చాలా రకాల గాసిప్స్ అయితే పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫైనల్ కాలేదు అని దర్శకుడు మొత్తానికి క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాను దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించినట్లుగా ఇదివరకే టాక్ వినిపించింది.
మొదట 1000 కోట్లు అనుకున్నప్పటికీ ఆ తర్వాత లెక్క మరింత పెరిగినట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే రెమ్యునరేషన్ ఎవరికీ ఎంత ముడుతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాజమౌళి ఎలాంటి సినిమా చేసిన కూడా హీరోలకు మిగతా ఆర్టిస్టులకు అందరికీ కూడా ఒక ఫిక్స్ డ్ రెమ్యునరేషన్ అయితే ఉంటుంది.
నిర్మాతతో పాటు రాజమౌళి బిజినెస్ వ్యవహారాలలో కూడా తన ప్రమేయం ఉండేలా చూసుకుంటాడు. కానీ ఎక్కడ కూడా తేడా రాకుండా నిర్మాత కూడా ఇబ్బంది పడకుండా రాజమౌళి లెక్కలు కొనసాగుతూ ఉంటాయి. ఇక ఆయన కూడా పారితోషకం తీసుకోకుండా సక్సెస్ లో షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక విధంగా నిర్మాతకు ఇది మంచి చేసే అంశమే.
అయితే మరోవైపు మహేష్ బాబు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత అదే తరహాలో ప్రతీ సినిమా బిజినెస్ లో వాటా తీసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళితో సినిమా అనేసరికి అతను బిజినెస్ లో షేర్ కాకుండా తప్పకుండా రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉందని టాక్ వచ్చింది. అయితే మహేష్ మాత్రం బిజినెస్ లో షేర్ తీసుకునే విధంగానే డీల్ మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.
మొన్నటి వరకు అలానే మంచి ప్రాఫిట్స్ అందుకున్న మహేష్, రాజమౌళి తరహా లోనే సక్సెస్ లో షేర్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక డైరెక్టర్ కు హీరోకు సక్సెస్ లో వాటా అంటే టాలీవుడ్ కి ఇది కొత్త తరహా డీల్స్ అని చెప్పవచ్చు. ఇక రాజమౌళి చాలా కాలం తరువాత ఇలాంటి డీల్ కు ఒప్పుకున్నాడట. బాహుబలి, RRR సినిమాల విషయంలో కూడా హీరోలకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసిన జక్కన్న ఈసారి మహేష్ తో మాత్రం ఆ ఫార్మాట్ కొనసాగించలేకపోయారు. మరి ఈ సినిమా బడ్జెట్ బిజినెస్ ఎలా ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి.