మహేష్ బాబు తో సినిమా... కండిషన్స్ పెడుతున్న రోజా!
2014 ఎన్నికల అనంతరం 2015 తర్వాత సినిమాల్లో కనిపించని రోజా.. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరప ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్, నగరి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ మంత్రి "ఆర్కే రోజా సెల్వమణి" గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు సినిమాల్లోనూ, ఇటు బుల్లి తెరపైనా తనదైన ముద్రవేసుకున్న రోజా... ప్రస్తుతం రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు.
ఈ నేపథ్యంలో సినిమాలో నటించే విషయంలో రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల అనంతరం 2015 తర్వాత సినిమాల్లో కనిపించని రోజా.. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరప ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ సమయంలో 2019 ఎన్నికల అనంతరం రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి చేపట్టారు.
దీంతో... జబర్దస్త్ కి కూడా గుడ్ బై చెప్పేసి.. పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ ఐపోయారు. ఈ సమయంలో తాజాగా మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మంత్రి రోజా. అవును... రోజాతో పాటు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయి న్ గా పేరొందినవారంతా ఇప్పుడు తల్లి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు.
అయితే... రోజా మాత్రం మంత్రి అయిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ సమయంలో భవిషత్తులో మళ్ళీ నటిస్తాను అని చెబుతున్న రోజా... ప్రస్తుతం మాత్రం తన మంత్రి పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబుతో ఎప్పుడు నటిస్తున్నారు అని ప్రశ్నించగా రోజా బదులిచ్చారు.
ఇందులో భాగంగా... మహేష్ బాబుతో నటించాలనేది తనకున్న చాలా పెద్ద కోరిక అని, దాని కోసం ఎదురు చూస్తున్నానని రోజా స్పందించారు. అయితే మహేష్ కి అమ్మ పాత్రలో కాకుండా అక్క, వదిన పాత్రల్లో నటించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి మంత్రి రోజా కోరిక ఎప్పుడు నెరవేరుతుందనేది వేచి చూడాలి.
కాగా మహేష్ బాబు ప్రస్తుతం "గుంటూరు కారం" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత రాజమౌళితో ఎస్.ఎస్.ఎం.బి.29 తెరకెక్కించనున్నాడు. ఇక "గుంటూరు కారం" సినిమా 2024 సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతుందని అంటున్నారు.