మహేష్.. హ్యాండ్సమ్ కా బాప్ లుక్

అందులో మహేష్ బాబు డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో క్రీమ్ కలర్ సూట్ తో కిర్రాక్ అనే లుక్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక మరికొందరు ఆ ఫోటోకు స్టైల్ కా బాప్ అంటూ అద్భుతమైన టాగ్స్ కూడా ఇస్తున్నారు.

Update: 2023-12-13 16:53 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా తన స్మైల్ తోనే ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. మాస్ లుక్ లో అయినా క్లాస్ లుక్ లో అయినా కూడా మహేష్ అందరిని ఎవరు మ్యాచ్ చేయలేరు అనే విధంగా షాక్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న హ్యాండ్సమ్ హీరోలలో సూపర్ స్టార్ టాప్ లిస్ట్ లో ఉంటాడు అని చెప్పవచ్చు.


ఈ విషయాన్ని చాలామంది సినీ తారలు కూడా ఒప్పుకున్నారు. ఇక కేవలం సినిమాలలోనే కాకుండా మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఒక విధంగా మహేష్ ఆ రూట్లో కూడా ఎక్కువ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటున్నడు. ఇక రీసెంట్గా మరొక యాడ్ కు సంబంధించిన ఆఫ్ స్క్రీన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

అందులో మహేష్ బాబు డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో క్రీమ్ కలర్ సూట్ తో కిర్రాక్ అనే లుక్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక మరికొందరు ఆ ఫోటోకు స్టైల్ కా బాప్ అంటూ అద్భుతమైన టాగ్స్ కూడా ఇస్తున్నారు. మహేష్ బాబు తన హ్యాండ్సమ్ లుక్స్ తో ఎవరినైనా సరే ఇట్టే అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు అని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

మహేష్ బాబు లుక్ చూస్తూ ఉంటే గుంటూరు కాలంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్లుగా తెలుస్తోంది దర్శకుడు త్రివిక్రమ్ ఈసారి బాబును మరింత అందంగా ప్రజెంట్ చేస్తాడని కూడా అనిపిస్తోంది. గుంటూరు కారం సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలోని మొదటి పాట ధమ్ మసాలా కూడా మంచి క్రేజ్ అందుకుంది.

రీసెంట్ ఓ మై బేబీ అనే మరొక పాటను కూడా విడుదల చేశారు. సినిమాను 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఒకవైపు మాస్ లుక్కుతోనే కాకుండా మరొకవైపు క్లాస్ లుక్ తో కూడా ఆకట్టుకుంటాడు అని తెలుస్తోంది హారిక హాసిని ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    

Similar News