యూట్యూబ్ లో డామినేషన్.. మహేష్, తారక్ బ్లాస్టింగ్

గ్లింప్స్ విషయంలో దేవర అదరగొడుతుండగా.. ట్రైలర్ పరంగా గుంటూరు కారం దూసుకుపోతోంది. ఈ మూవీ ట్రైలర్ 24 గంటల్లో 37.65 మిలియన్ల వ్యూస్ పొందింది.

Update: 2024-01-10 06:17 GMT

సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తమ ఫేవరెట్ హీరో మూవీ థియేటర్ ఫుల్ రన్ గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. 24 గంటల్లో ట్రైలర్, టీజర్, గ్లింప్స్ వ్యూస్ ల కోసం మాట్లాడుకుంటున్నారు. రిలీజ్ అయిన తొలి 24 గంటల్లో వచ్చిన వ్యూస్.. కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ నటిస్తున్న దేవర సినిమా గ్లింప్స్.. ఇటీవలే రిలీజై ఇప్పటి వరకు ఉన్న సౌత్ సినిమాల రికార్డును బ్రేక్ చేసింది. తొలి 24 గంటల్లో 26.17 మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపింది. హైయెస్ట్ వ్యూస్ సాధించిన గ్లింప్స్ లిస్ట్ లో టాప్-1లో నిలిచింది. ఆ తర్వాత ప్లేస్ లో సంక్రాంతికి విడుదల కానున్న గుంటూరు కారం గ్లింప్స్ 20.98 మిలియన్ల వ్యూస్ తో ఉంది.

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప-2.. 20.45 మిలియన్ల వ్యూస్ తో మూడో స్థానంలో నిలిచింది. లైగర్ 15.92 మిలియన్ వ్యూస్, ఉస్తాద్ భగత్ సింగ్ 15.77 మిలియన్ వ్యూస్, ఓజీ 14.49 మిలియన్ వ్యూస్, కల్కి 2808 AD 11.94 వ్యూస్, భీమ్లా నాయక్ 8.49 మిలియన్ వ్యూస్ తో టాప్ -8లో ఉన్నాయి.

గ్లింప్స్ విషయంలో దేవర అదరగొడుతుండగా.. ట్రైలర్ పరంగా గుంటూరు కారం దూసుకుపోతోంది. ఈ మూవీ ట్రైలర్ 24 గంటల్లో 37.65 మిలియన్ల వ్యూస్ పొందింది. ఆ తర్వాత స్థానంలో 32.5 మిలియన్ వ్యూస్ తో ప్రభాస్ మూవీ సలార్ ఉంది. మూడు, నాలుగు స్థానాల్లో విజయ్ సినిమాలు లియో, బీస్ట్ ఉన్నాయి. 26.7 మిలియన్ వ్యూస్‌తో 5వ స్థానంలో సర్కార్ వారి పాట నిలవగా, 23.6 మిలియన్ వ్యూస్‌తో ప్రభాస్ రాధే శ్యామ్ 6వ స్థానంలో ఉన్నాయి.

ఇక 2024లో భారీ అంచనాలు ఉన్న అనేక సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అడవి శేష్ నటించిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 మూవీ ఈ ఏడాదిలోనే వచ్చే ఛాన్స్ ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా సెప్టెంబర్ లో విడుదల అవ్వనుందట. కార్తికేయ 2తో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయిన నిఖిల్ స్వయంభు అనే హిస్టారికల్ పాయింట్ తో మరోసారి వస్తున్నారు. ఇక ఈ సినిమాల ట్రైలర్లు, టీజర్లు, గ్లింప్స్ ఎన్ని రికార్డులు బద్దలకొడతాయో చూడాలి.

Tags:    

Similar News