ఆ సమయంలో చంపేస్తామని ఫోన్ కాల్స్‌..!

తాజాగా బాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న ట్రోల్స్ పై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆ ఫోటో కారణంగా తాను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాను.

Update: 2023-08-30 13:52 GMT

పాకిస్తానీ నటి అయిన మహీరా ఖాన్ బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో నటించింది. ఆమె కు పాకిస్తాన్‌ లో కంటే కూడా బాలీవుడ్ లోనే మంచి గుర్తింపు ఎక్కువ లభించింది. 2017 సంవత్సరంలో రాయిస్ సినిమా ద్వారా ఈ అమ్మడు బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సమయంలోనే రణ్‌బీర్ కపూర్ తో కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటో బయటకు వచ్చింది.

తాజాగా బాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న ట్రోల్స్ పై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆ ఫోటో కారణంగా తాను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాను. ఒకానొక సమయంలో నేను కనీసం బయట కూడా తిరగలేక పోయాను. ఎక్కడ చూసినా కూడా అంతా తిడుతూనే ఉండేవారు. నాపై ఎవరో దాడి చేస్తున్నట్లుగా ఒళ్లంతా కూడా చెమటలు పట్టేవి. ఎంత మంది డాక్టర్ల వద్దకు వెళ్లినా ఫలితం లేదు.

2016 సంవత్సరంలో ఉరి ఉగ్ర దాడులు జరిగాయి. అప్పటికే నేను రాయిస్ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాను. ఉరి ఉగ్రదాడుల నేపథ్యంలో చాలా మంది పాకిస్తాన్ నటీ నటులను బాలీవుడ్ లో నిషేదించాలి అన్నారు. దాంతో నేను రాయిస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాలేక పోయాను అంది.

పాకిస్తాన్‌ నటిని అయిన కారణంగా నన్ను చంపేస్తామని కూడా చాలా మంది ఫోన్ లు చేసి మరీ హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో చాలా మంది నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ కామెంట్స్‌ చేస్తూ వచ్చారు. నేను ఆ సమయంలో కనీసం బయట తిరగడానికి కూడా ఇబ్బంది పడ్డాను. కెరీర్‌ పరంగా చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలనుకున్న నాకు విమర్శల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి అంది.

Tags:    

Similar News