వాజ్ పేయి బయోపిక్ లో పంకజ్ జీవించాడా?
ఇందులో వాజ్ పాయి పాత్రని పంకజ్ త్రిపాఠీ పోషిస్తున్నారు. కొన్ని నెలలుగా ఆన్ సెట్స్ లో ఉ న్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జీవిత చరిత్ర ఆధారంగా 'మై అటల్ హూ' అనే టైటిల్ తో రవి జాదవ్ ఓ చిత్రాన్ని తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో వాజ్ పాయి పాత్రని పంకజ్ త్రిపాఠీ పోషిస్తున్నారు. కొన్ని నెలలుగా ఆన్ సెట్స్ లో ఉ న్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ సందర్భంగా ఆన్ సెట్స్ విశేషాల్ని పంకజ్ పంచుకున్నారు. ఆ వేంటో ఆయన మాటల్లోనే.. ఈ ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది.
అటల్ బిహారీ వాజ్ పాయల్ లాంటి గొప్ప వ్యక్తి తెరపై చూపించే అదృష్టం నాకు దక్కింది. ఈ పాత్రకు నేను ఎంత న్యాయం చేసానో తెలియదు కానీ... ఎలా చేసాను? అన్నది ప్రేక్షకులు సినిమా చూసి డిసైడ్ చేయాలి.
నాకు నేనుగా బాగా చేసాను అని చెబితే అతిగా ఉంటుంది. అందుకే ఈ సినిమా గురించి ఇంతకు మించి ఎక్కువగా మాట్లాడను' అని అన్నారు.ఇక దర్శకుడు రవి జావెద్ మాత్రం పంకజ్ నటనని ఆకాశానికి ఎత్తేసారు.
తాను ఓ గొప్ప నటుడు. ప్రధాని గారీ పాత్రకు ఎవరైనా బాగుంటుందా? అని ఆలోచిస్తోన్న సమయంలో పంకజ్ స్ట్రైక్ అయ్యారు. వెంటనే ఆయన్ని పిలిపించి రోల్ గురించి చెప్పగానే ధైర్యంగా ఒకే చెప్పారు. అయినా సెట్స్ లో ఎలా ఉంటుందా? అనే చిన్న టెన్షన్ ఉండేది. కానీ తాన నటన చూసి తర్వాత నటించలేదు ...వాజ్ పాయ్ పాత్రలో జీవించాడని అర్ధమైంది. ఆపాత్రకి తగ్గ పర్పెక్ట్ నటుడ్ని ఎంపిక చేసుకున్నాను.
మిగతా పాత్రలకు..వాజ్ పాయ్ చుట్టూ ఉండే పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతీ పాత్రలో కొత్త దనం కనిపిస్తుంది. వాజ్ పాయ్ ఆహార్యంలో అచ్చు గుద్దినట్లే ఉన్నారు. ప్రచార చిత్రాలతో ఆవిషయం మీకు అర్ధమవుతుంది' అని అన్నారు.
చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో ఒక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. అన్ని పనులు పూర్తిచేసి డిసెంబర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వినోద్ బాన్ శాలి..సందీప్ సింగ్..సామ్ ఖాన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తు న్నారు.