బిల్డింగ్ టెర్రాస్ పైనుంచి దూకి మలైకా తండ్రి సూసైడ్
పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో `కెవ్వు కేక` పాటతో తెలుగు వారికి సుపరిచితమైన భామ మలైకా అరోరా.
పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో `కెవ్వు కేక` పాటతో తెలుగు వారికి సుపరిచితమైన భామ మలైకా అరోరా. ఇటీవల రకరకాల కారణాలతో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తాజాగా మలైకా తండ్రి అనీల్ ఆరోరా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అనిల్ అరోరా తన బాంద్రా నివాసం టెర్రస్ పై నుండి దూకారని తెలుస్తోంది. దీనిని అనుమానాస్పద మృతిగా చెబుతున్నారు. తదుపరి విచారణ కోసం పోలీసులు ప్రస్తుతం ఘటనాస్థలికి చేరుకున్నారు. పుణెలో ఉన్న మలైకా దురదృష్టకర వార్త తెలిసిన వెంటనే ముంబైకి వెళ్లారని తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
భారత సరిహద్దు పట్టణమైన ఫజిల్కాకు చెందిన అనిల్ అరోరా ఇండియన్ మర్చంట్ నేవీలో పనిచేశారు. అతడు పూర్తిగా ఒక ప్రైవేట్ పర్సనాలిటీ. అతడు కుమార్తెలతో పరస్పర అనుబంధం కలిగి ఉన్నారు. అయితే అతడి వృత్తిగత జీవితం గురించి బహిరంగంగా చాలా తక్కువగా తెలుసు. గత సంవత్సరం మలైకా అరోరా ఆమె తల్లి ఆస్పత్రిలో అడ్మిట్ అయిన అనిల్‌ను సందర్శించడానికి ముంబై ఆసుపత్రి వెలుపల కనిపించారు. అనిల్ బాంద్రాలో నివసించేవారు. అలాగే మలైకా, ఆమె సోదరి అమృత తరచూ అతడిని సందర్శించేవారు. మలైకా అరోరా పాలి హిల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.
అనీల్ అరోరా భారత సరిహద్దు పట్టణం ఫాజిల్కాకు చెందిన పంజాబీ హిందువు. అతడు భారత మర్చంట్ నేవీలో పని చేసారు. మలైకా తల్లి జాయిస్ పాలీకార్ప్ మలయాళీ క్రిస్టియన్. మలైకా తల్లితండ్రులు ఆమెకు 11 ఏళ్ళ వయసు ఉండగా విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు మలైకా తన తల్లి, సోదరి అమృతతో కలిసి చెంబూర్‌కు వెళ్లడానికి దారితీసింది. అమృత 2009లో వ్యాపారవేత్త షకీల్ లడక్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అజాన్ మరియు రాయన్ వారి పేర్లు.
మలైకా అరోరా భారతీయ సినిమాల్లో డ్యాన్స్ నంబర్‌లతో పాపులరయ్యారు. రియాలిటీ టీవీ షోలలో న్యాయనిర్ణేతగా పనిచేసినందుకు ఉత్తమ జడ్జిగా గుర్తింపు అందుకున్నారు. మలైకా ఇటీవలే అర్జున్ కపూర్ నుంచి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.