బ్రేకింగ్ : జైలర్‌ వాయిదా.. రాజీ కుదిరింది

తాజాగా రాజీ కుదరడంతో ఆ సినిమాను వాయిదా వేసేందుకు ఓకే చెప్పారు.

Update: 2023-08-09 06:25 GMT

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉన్నాయి. రోబో సినిమా తర్వాత ఇప్పటి వరకు రజినీకాంత్ ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. తమిళనాట ఆయనకి ఉన్న క్రేజ్ నేపథ్యం లో ఒక మోస్తరు వసూళ్లను సాధిస్తూ వస్తున్నాడు. కానీ తెలుగు లో మాత్రం మినిమం వసూళ్లు నమోదు చేసిన దాఖలాలు లేవు.

గత ఫలితాల నేపథ్యం లో రజినీకాంత్‌ కాస్త జాగ్రత్తగా ఆలోచించి 'జైలర్‌' సినిమాను కమిట్ అయ్యాడు. నెల్సన్‌ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో తమిళ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఉన్నారు. జైలర్ రేపు అంటే 10వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

రజినీకాంత్ జైలర్ సినిమాతో పాటు మలయాళ సినిమా 'జైలర్‌' కూడా అదే ఆగస్టు 10వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. మలయాళంలో జైలర్ సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ అయింది. మలయాళ జైలర్ సినిమా లో ధ్యాన్‌ శ్రీనివాసన్‌ ప్రధాన పాత్రలో నటించగా మదతిల్ దర్శకత్వం వహించారు.

మొన్నటి వరకు మలయాళం జైలర్ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ మేకర్స్ బలంగా వాదిస్తూ వచ్చారు. కానీ తాజాగా రజినీకాంత్‌ 'జైలర్‌' సినిమా కోసం తమ జైలర్‌ ను ఒక వారం వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ధ్యాన్‌ శ్రీనివాసన్ మరియు సక్కీర్‌ మదతిల్‌ లు నిర్ణయానికి వచ్చారు.

గత కొన్ని రోజులుగా తమిళ జైలర్‌ సినిమా మేకర్స్ మలయాళ జైలర్ మేకర్స్ తో చర్చలు జరుపుతూ వచ్చారు. తాజాగా రాజీ కుదరడంతో ఆ సినిమాను వాయిదా వేసేందుకు ఓకే చెప్పారు. మలయాళ జైలర్ సినిమా ను ఆగస్టు 18వ తారీకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

Tags:    

Similar News